India Post Accident Insurance Policy : జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకోని ప్రమాదాలు, విపత్తులు ఏర్పడినప్పుడు వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకవేళ కుటుంబ యజమాని మరణిస్తే, అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే, కచ్చితంగా ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమాలను తీసుకోవాలి. అప్పుడే కుటుంబ భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే భారత తపాలా శాఖ నామమాత్రపు ధరలతో ప్రమాద బీమా పథకాలను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Rs 755 India Post Insurance Policy : భారత తపాలాశాఖ - నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి రూ.755లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ బెనిఫిట్స్ :
- ఒకవేళ ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి లేదా నామినీకి రూ.15 లక్షలు పరిహారంగా అందిస్తారు.
- శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ.15 లక్షలు ఇస్తారు.
- పాలసీదారు చనిపోతే, అతని పిల్లల చదువుల కోసం రూ.1 లక్ష; పిల్లల పెళ్లి కోసం రూ.1 లక్ష అందజేస్తారు.
- పాలసీదారుడు బతికే ఉంటే, వైద్య ఖర్చులకు రూ.1 లక్ష అందజేస్తారు.
- హాస్పిటల్లో సాధారణ వైద్యం చేయించుకుంటే, రోజుకు రూ.1000, ఐసీయూలో చేరితే రోజుకు రూ.2000 ఇస్తారు.
- ఒక చేయి లేదా ఒక కాలు విరిగితే రూ.25,000 వరకు పరిహారమిస్తారు.
Rs 520 India Post Insurance Policy : టాటా ఏఐజీతో కలిసి భారత తపాలాశాఖ రూ.520లకు ఒక ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఈ బీమా పాలసీ ప్రయెజనాలు :
- ఈ పాలసీలో చేరిన వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే, అతని కుటుంబానికి లేదా నామినీకి రూ.10 లక్షలు ఇస్తారు.
- శాశ్వత వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం - వీటిలో ఏది ఏర్పడినా రూ.10 లక్షల వరకు పరిహారం అందిస్తారు.
- ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చుల కోసం రూ.1లక్ష అందజేస్తారు.
- పాలసీదారు చనిపోతే, అతని/ఆమె పిల్లల చదువుల కోసం రూ.1 లక్ష ఇస్తారు.
Rs 320 India Post Insurance Policy : భారత తపాలా శాఖ, టాటా ఏఐజీలు కలిసి రూ.320కు ఒక ప్రమాద బీమా పాలసీని అందిస్తున్నాయి. ఈ ప్రమాద బీమా ప్రయోజనాలు :
- పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే, అతని కుటుంబానికి లేదా నామినీకి రూ.5 లక్షలు పరిహారం ఇస్తారు.
- శాశ్వత వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు అందజేస్తారు.
- ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చుల కోసం రూ.50 వేలు వరకు ఇస్తారు.
ఈ పాలసీలు ఎవరు తీసుకోవచ్చు!
భారత తపాలాశాఖ అందిస్తున్న ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను 18-65 ఏళ్ల మధ్య ఉన్నవారందరూ తీసుకోవచ్చు. ఈ పాలసీలు తీసుకోవాలంటే, ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)లో కచ్చితంగా ఓ ఖాతాను ప్రారంభించాలి. కేవలం రూ.100తోనే ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. భారతదేశంలోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లోనూ ఈ ప్రమాద బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు.
ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ e-KYC - 'ఎమ్ఆధార్' నయా ఫీచర్
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్ - ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు!