Exchange Rs. 2000 Notes Using Amazon Pay Wallet : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ వినియోగదారులు 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు గొప్ప అవకాశం కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మే 19న దేశంలో చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న 2వేల రూపాయల నోట్ల(Rs. 2000 Notes Withdraw in India)ను సెప్టెంబర్ 30 వరకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చని ప్రకటించింది.
Rs. 2000 Notes Exchange in Amazon Pay Wallet : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) ప్రకటనతో దేశంలో చాలా మంది ప్రజలు తమ వద్ద ఉన్న 2వేల రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా తమ యూజర్లు 2వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అనుమతిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల సమయంలో మిగిలిపోయిన మొత్తాన్ని అమెజాన్ పే(Amazon Pay) వ్యాలెట్లలో లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ-కామర్స్ దిగ్గజం ఖాతాదారులు గరిష్ఠంగా నెలకు 50వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. వాటిలో డినామినేషన్ రూ. 2,000 కరెన్సీ నోట్లు కూడా ఉండవచ్చని తెలిపింది.
జాబ్ మానేస్తే భారీ బోనస్- అమెజాన్ వింత ఆఫర్!
How to Exchange Rs. 2000 Notes using Amazon Pay Wallet in Telugu :
అమెజాన్ పే వాలెట్ ఉపయోగించి రూ. 2000 వేల మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Step 1 : మొదట వినియోగదారులు తమ ఫోన్లో Amazon యాప్‌లో వీడియో KYCని పూర్తి చేయాలి.
Step 2 : ఈ KYC ప్రక్రియ పూర్తయిన తర్వాత అమెజాన్ పే వినియోగదారులు ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేయాలి.
Step 3 : ఆ తర్వాత కస్టమర్లు తమ ఆర్డర్‌పై డెలివరీ ఏజెంట్‌కి నగదును అందజేయవచ్చు.
Step 4 : అప్పుడు డెలివరీ ఏజెంట్ నినియోగదారుడి అమెజాన్ పే బ్యాలెన్స్‌లో మిగిలిన బ్యాలెన్స్ ఆ సమయంలోనే అప్డేట్ చేస్తారు.
Deposit 2000 Currency Notes in Amazon Pay : ఇలా అమెజాన్ పే వాలెట్లో అప్డేట్ చేసిన మొత్తం.. కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ కోసం లేదా QR కోడ్లను ఉపయోగించి చెల్లించడం, మొబైల్ రీఛార్జ్‌లు చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బులు పంపడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato) వంటి యాప్‌లలో డిజిటల్ పేమెంట్ల కోసం వాడుకోవచ్చు. ఈ విధంగా అమెజాన్ పే బ్యాలెన్స్‌ని 2వేల రూపాయల నోట్లతో మార్చుకునే లేదా అప్డేట్ చేసుకునే సదుపాయం ప్రముఖ కామర్స్ సంస్థ అమెజాన్ కల్పిస్తోంది.
ఈ అవకాశం వారికి మాత్రమే : అయితే ఈ విధంగా రూ. 2,000 నోట్లను మార్చుకునే అవకాశం KYC కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా ఈ ఎక్స్ఛేంజ్ని ప్రారంభించే ముందు అమెజాన్ పే వినియోగదారులు ముందు KYC ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించాలని అమెజాన్ సంస్థ పేర్కొంది.
JioBook Laptop Sales : జియోబుక్ ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్!
IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!
Amazon Prime Lite : తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లైట్.. కేవలం రూ.999తో సూపర్ బెనిఫిట్స్