SBI Amrit Kalash Scheme : నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదిస్తున్నామో అంతే మొత్తంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు చేయాలి. ఈ క్రమంలో పొదుపు పథకాల్లో ఒకటైన ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) ప్రజల నమ్మకాన్ని బాగా చూరగొంది. ముఖ్యంగా మన దేశంలో ఈ ఎఫ్డీలపై వినియోగదారులకు అపార నమ్మకం ఉంది. అధిక వడ్డీని అందించడంతో పాటు సురక్షిత పెట్టుబడి పథకం కావడంతో దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి.
Amrit Kalash Deposit Scheme : ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) సరికొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటైన ఎస్బీఐ 'అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం' చాలా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఆ పథకం గడువు ఆగస్టు15తో రెండోసారి ముగిసింది. తాజాగా మరోసారి ఎస్బీఐ కీలక ప్రకటన చేస్తూ తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు మరోసారి పొడిగిస్తూ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి ఎవరెవరూ అప్లై చేసుకోవచ్చు? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎప్పటి వరకు ఈ స్కీమ్ గడువు పెంచింది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SBI Amrit Kalash Scheme Details : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ కస్టమర్ల కోసం 2023 ఏప్రిల్ 12న 'అమృత్ కలశ్ స్కీమ్' అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. తొలుత కొద్దిరోజులు మాత్రమే ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత.. మొదటిసారి జూన్ 30వరకు పొడిగించింది. అనంతరం.. రెండోసారి ఆగస్ట్ 15వ తేదీ వరకు పెంచింది. తాజాగా మూడోసారి డిసెంబర్ 31, 2023 వరకు గడువు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన అధికారిక వైబ్సైట్లో పేర్కొంది. అప్పటివరకు ఈ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. 400 రోజుల టైమ్ పీరియడ్‌తో తీసుకొచ్చిన ఎస్బీఐ "అమృత్ కలశ్" పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
"అమృత్ కలశ్" స్కీమ్ కోసం అప్లై (How to Apply Amrit Kalash Scheme) చేసుకోవడం ఎలా..?
- మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఏ ఎస్బీఐ బ్రాంచ్‌కైనా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకవేళ మీకు దగ్గరలో బ్యాంక్ లేకపోతే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్(SBI Yono App) ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- ఈ పథకం ద్వారా రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.
SBI Fixed Deposit Rates 2023 : ఎస్బీఐ వీ కేర్ Vs అమృత్ కలశ్.. ఏది బెస్ట్ ఆప్షన్?
అమృత్ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్(Amrit Kalash Scheme Benefits)..
1. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం పొందాలనే వారికి ఈ ఎఫ్డీ స్కీమ్ చాలా అనువైన పథకం.
2. ఈ పథకం ద్వారా ముందస్తుగా డిపాజిట్లనూ ఉపసంహరించుకునే వీలు ఉంటుంది.
3. అదేవిధంగా లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
4. ఈ పథకం ద్వారా మీరు పొందే వడ్డీపై ఇన్‌కం టాక్స్ రూల్స్ ప్రకారం టీడీఎస్ కట్ అవుతుంది. అలా కట్ అయిన మొత్తాన్ని ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
5. ఈ స్కీమ్ ద్వారా ఎన్ఆర్ఐ రూపీ టర్మ్ డిపాజిట్లు, డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు.
6. కొత్త డిపాజిట్లు, రెన్యూవల్‌కు కూడా ఈ పథకంలో ఛాన్స్ ఉంటుంది.
7. ఈ పథకంలో మీరు జమ చేసిన డబ్బుకు మెచ్యూరిటీ సమయంలో వడ్డీ అందుకుంటారు. నేరుగా కస్టమర్ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది.
ఈ పథకానికి ఎంత వడ్డీ వస్తుంది..?
ఏడాదిలోనే పూర్తవ్వాలి అనుకొనే వారికి ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే ఈ పథకం ద్వారా సంవత్సరానికి పోస్టాఫీస్ అందిస్తున్న వడ్డీ కన్నా అధికంగా పొందవచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.6 శాతం వడ్డీరేటు అందుతుంది. అదే సాధారణ ప్రజలకు ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ జమ చేస్తుంది. అలాగే ఎస్బీఐ(SBI) ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం వడ్డీరేటును ఈ పథకం ద్వారా అందిస్తోంది.
ఉదాహరణకు.. ఈ పథకం ద్వారా రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు ఎంతమొత్తంలో వడ్డీ వస్తుందో చూద్దాం. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు రూ.8,600 వడ్డీ వస్తుంది. అదే సాధారణ ప్రజలకు లక్ష రూపాయలపై డిపాజిట్‌పై రూ. 8,017 వడ్డీ కస్టమర్ అకౌంట్లో జమ అవుతుంది.
DMF Vs FD.. రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్?.. రాబడి ఎందులో ఎక్కువంటే?