ETV Bharat / business

ఆస్తి తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారా?.. వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే! - రుణాలు తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలు

కలలను సాకారం చేసుకునేందుకు మనం పొదుపు చేసిన డబ్బు సరిపోకపోవచ్చు. అయితే అలాంటి సందర్భాలలో ఆస్తి తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం అనివార్యం కావచ్చు. అయితే ఈ తరహా రుణాలను తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం తప్పనిసరి. మరి ఆ అంశాలేంటో తెలుసుకుందాం.

Factors to Consider While Taking Loans
రుణాలు
author img

By

Published : Dec 17, 2022, 3:03 PM IST

ఆర్థిక స్వేచ్ఛకు పునాది పొదుపు. తమ కలలను సాకారం చేసుకునేందుకు అన్ని వేళలా ఇది సరిపోకపోవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి.. అత్యవసరంగా కొంత డబ్బు కావాలి.. సందర్భం ఏదైనా సరే.. కొన్నిసార్లు అప్పు తీసుకోవడం అనివార్యం కావచ్చు. మార్కెట్లో ఎన్నో రకాల రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆస్తి తనఖా రుణాలు ఒకటి. హామీ లేని రుణాలతో పోలిస్తే వీటిలో కొన్ని సానుకూలతలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ తరహా రుణాలు తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇప్పటి వరకూ రుణాలు తీసుకోని వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఆస్తి తనఖా రుణాలు (లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రాపర్టీ- ఎల్‌పీఏ) సులభంగా తీసుకునేందుకు వీలవుతుంది. ఎలాంటి హామీ లేని వ్యక్తిగత, ఇతర రుణాలతో పోలిస్తే.. అధిక మొత్తం లభించడంతోపాటు, వడ్డీ రేటూ కొంత తక్కువగా ఉంటుంది. 15-25 ఏళ్ల దీర్ఘకాలం వరకూ వ్యవధి ఉంటుంది. మోసపూరిత కార్యకలాపాలకు మినహా ఎలాంటి లావాదేవీలకైనా ఈ మొత్తాన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

సొంతిల్లు, వాణిజ్య స్థలం తాకట్టు పెట్టి, వ్యాపార అవసరాల కోసం రుణాలను తీసుకునేందుకు వీలుంటుంది. అదే సమయంలో రుణ గ్రహీత తన ఆస్తిని తాను ఉపయోగించుకుంటూనే ఉంటారు. గృహ, వాణిజ్య రకం, ఆస్తిపై ఉన్న హక్కు ఆధారంగా రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇళ్లకు సాధారణంగా అధిక విలువ (లోన్‌ టు ప్రాపర్టీ వాల్యూ) ఉంటుంది.

ఎలా తీసుకోవాలి?
తనఖా పెట్టాలనుకుంటున్న ఆస్తికి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ తర్వాతే మీరు రుణానికి దరఖాస్తు చేయడం మేలు. ప్రస్తుతం బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు ఈ రుణాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసేందుకు వీలుంది. వచ్చిన దరఖాస్తులను రుణదాత సమగ్రంగా పరిశీలిస్తారు. రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరుతోపాటు, తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆస్తి విలువ, వయసు, వృత్తి, ఆస్తి ఉన్న ప్రాంతం, పాతదా/కొత్తదా లాంటి వివరాలు చూస్తారు. ఆ ఆస్తి ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, యాజమాన్య పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అనేదీ కీలకమే. ఆ తర్వాత ఆస్తి విలువను లెక్కిస్తారు. మార్కెట్‌ విలువతో పోలిస్తే ఆర్థిక సంస్థల లెక్కల్లో వ్యత్యాసం ఉంటుంది.

80 శాతం వరకూ..
సాధారణంగా ఆస్తి విలువలో సాధారణంగా 80 శాతం దాకా రుణం అందుతుంది. కొన్నిసార్లు తగ్గించవచ్చు. ఉదాహరణకు ఒక ఆస్తి విలువ రూ.కోటిగా లెక్కగట్టినప్పటికీ.. కొన్ని పరిమితుల వల్ల రూ.70 లక్షల వరకే రుణం అందించవచ్చు.

జాగ్రత్తగా..
రుణం తీసుకుంటున్నామంటే.. ఒక సుదీర్ఘ కాల ఆర్థిక ఒప్పందం చేసుక్నుట్లే! కాబట్టి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. దరఖాస్తు చేసేముందే ఏ ఆర్థిక సంస్థను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఆర్థికంగా నమ్మకమైన, పేరున్న సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది.

స్వల్ల కాల వ్యవధి కంటే దీర్ఘకాలిక రుణాలతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు రూ.70వేల నెలవారీ ఆదాయం ఉన్న వ్యక్తి రూ.25 లక్షల రుణాన్ని, 12.5 శాతం వడ్డీకి అయిదేళ్ల కాల వ్యవధికి తీసుకున్నారనుకుందాం. అప్పుడు వాయిదా రూ.56,245 అవుతుంది. అదే 15 ఏళ్లకు తీసుకుంటే.. వాయిదా మొత్తం రూ.30,813 అవుతుంది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఎప్పుడూ మంచిదన్న విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు.

  • విలువ అధికంగా చెల్లించే సంస్థల నుంచి రుణం తీసుకునే అంశాన్ని పరిశీలించండి.
  • కొన్ని సంస్థలు ఆదాయాన్ని బట్టి రుణం ఇస్తున్నాయి. గరిష్ఠంగా ఎంత రుణం లభిస్తుందన్నది సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది.
  • దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకునేటప్పుడు కొన్నిసార్లు మధ్యలో ఆ రుణాన్ని పాక్షికంగా తీర్చేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. చెల్లింపుల విషయంలో సాధ్యమైనంత వెసులుబాట్లు ఉన్నాయా లేదా ముందే తెలుసుకోండి.
  • ఇతర రుణాలతో పోలిస్తే.. ఆస్తిని హామీగా ఉంచి తీసుకునే తనఖా రుణాలు సులభంగానే లభిస్తాయి. ఈ రుణాలను తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు అన్ని అంశాలనూ ముందే తెలుసుకొని, నిర్ణయం తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.