ETV Bharat / business

భారత్​లో ఐఫోన్ల తయారీ మూడింతలు.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు!

author img

By

Published : Dec 20, 2022, 7:56 AM IST

ఐఫోన్ల తయారీ కంపెనీ భారత్​లో తన ఉత్పత్తిని మూడింతలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే భారత్‌ ఒక ప్రధాన సరఫరా కేంద్రంగా మారగలదని అంచనా. దీంతో దేశీయంగా సరఫరాదార్లు సంఖ్య పెరిగి.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

iphone production in india
భారత్​లో ఐఫోన్ల

భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని మూడింతలు చేయాలన్న యాపిల్‌ సంస్థ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే.. ఆ అమెరికా కంపెనీకి భారత్‌ ఒక ప్రధాన సరఫరా కేంద్రంగా మారగలదని అంచనా. అంతర్జాతీయంగా యాపిల్‌కు 190 మంది సరఫరాదార్లుండగా.. భారత్‌లో 12 తయారీ కేంద్రాలే ఉన్నాయి. చైనాలో ఐఫోన్‌ తయారీని తగ్గించి, ఇతర దేశాలకు తయారీని విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా భారత్‌పై యాపిల్‌ దృష్టి సారించింది. 2025 కల్లా అంతర్జాతీయంగా వినియోగించే ఐఫోన్లలో 25 శాతం భారత్‌లో తయారు చేయాలన్నది యాపిల్‌ ప్రణాళిక అని జేపీ మోర్గాన్‌ నివేదిక పేర్కొంటోంది. యాపిల్‌ వ్యూహాల వల్ల భారత్‌లో మరింత మంది సరఫరాదార్లకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్యానల్‌ ఫ్యాబ్రికేషన్‌, సెమీకండక్టర్‌ వంటి విభాగాలు రాణిస్తాయి. దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 5 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందని ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది.

భారత కంపెనీలకూ ప్రయోజనాలు
ప్రస్తుతం దేశంలో యాపిల్‌ సరఫరాదార్ల విషయానికొస్తే తమిళనాడులో అయిదు, కర్ణాటకలో రెండు, ఆంధ్రప్రదేశ్‌ (చెంగ్‌ యూ ప్రెసిషన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ), మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఇపుడు తయారీని మరింత విస్తరిస్తే, భారత్‌లోని కంపెనీలు తయారు చేసే చిప్‌ సెట్లు, మరిన్ని విడిభాగాలకు మార్కెట్‌ దక్కుతుంది. ఇప్పటికే వేదాంతా గ్రూప్‌ చిప్‌, డిస్‌ప్లే తయారీలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. విడిభాగాల సరఫరా కంపెనీలు భారత్‌లో తమ విస్తరణను మరింత బలోపేతం చేసుకోనున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్‌ తన తమిళనాడులోని హోసూరులోని ప్లాంటులో మరో 8000 మందిని నియమించుకోనుంది.

విదేశీ కంపెనీలూ వస్తున్నాయ్‌
ప్రస్తుతం తైవాన్‌, చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాల నుంచి చాలా వరకు తయారీ కంపెనీలు ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాయి. అంటే మన దేశంలోనూ మరిన్ని తయారీ యూనిట్లకు అవకాశం ఏర్పడుతుంది. ఫాక్స్‌కాన్‌ తన భారత యూనిట్‌లో తయారీ విస్తరణ కోసం 500 మి. డాలర్లను వెచ్చించనుంది. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లోని తన యూనిట్లో 50,000 ఉద్యోగాలను ఈ కంపెనీ జత చేయనుంది. వీరిలో 15,000-18,000 మందికి సమీపకాలంలోనే ఉద్యోగాలివ్వనున్నట్లు సమాచారం. సెప్టెంబరులో తైవాన్‌కు చెందిన పెగాట్రాన్‌ భారత్‌లో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. యాపిల్‌కు దేశీయంగా ఈ సంస్థ మూడో సరఫరాదారుగా మారింది. ఈ కంపెనీ చెన్నైలోని మహీంద్రా వరల్డ్‌ సిటీ ప్లాంటుపై రూ.1100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 14,000 మందికి ఉద్యోగావకాశాలివ్వనుంది.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.