ETV Bharat / business

తగ్గిన 'కాఫీ డే' అప్పులు.. పూర్వ వైభవం తిరిగి వచ్చేనా! - వీజీ సిద్ధార్థ్‌ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ అప్పులు తగ్గాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు చేరినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కాఫీ డే వ్యవస్థాపకుడైనా వీజీ సిద్ధార్థ్‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కంపెనీ పగ్గాలు అందుకున్న ఆయన భార్య మాళవికా హెగ్డే.. కంపెనీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ccd
ccd
author img

By

Published : Sep 1, 2022, 7:10 AM IST

Updated : Sep 1, 2022, 7:31 AM IST

Coffee Day Debt Level Reduced : కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ (CDEL) అప్పులు తగ్గాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు చేరినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2019 మార్చి 31 నాటికి కంపెనీ అప్పులు రూ.7214 కోట్లుగా ఉండగా.. 2021 మార్చి నాటికి రూ.1898 కోట్లకు.. 2022 మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. ఇవి కాకుండా అసలు, వడ్డీ కలిపి రూ.230.66 కోట్ల మేర రుణాలు, ఆర్థిక సంస్థలకు చేయాల్సిన చెల్లింపులు డిఫాల్ట్‌లుగా మారాయని కంపెనీ పేర్కొంది. మరో రూ.249.02 కోట్ల మేర నాన్‌ కన్వెర్టబుల్‌ డిబెంచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

కాఫీ డే వ్యవస్థాపకుడైనా వీజీ సిద్ధార్థ్‌.. 2019 జులైలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే నాటికి కంపెనీ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ పగ్గాలు అందుకున్న వీజీ సిద్ధార్థ్‌ భార్య మాళవికా హెగ్డే.. కంపెనీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాఫీడే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ తన టెక్నాలజీ బిజినెస్‌ను బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌నకు విక్రయించింది. తద్వారా 2020 మార్చిలో రూ.1644 కోట్ల రుణాలను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత క్రమంగా ఆ కంపెనీ రుణాలను తగ్గించుకుంటూ వస్తోంది. సీడీఈఎల్‌ అనుబంధ సంస్థ కాఫీ డే గ్లోబల్‌ లిమిటెడ్‌ ప్రస్తుతం 158 నగరాల్లో 495 కేఫ్‌ కాఫీ డే ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది. 285 కేఫ్‌ కాఫీ డే వాల్యూ ఎక్స్‌ప్రెస్‌ కియోస్క్‌లను కలిగి ఉంది. కార్పొరేట్‌ కార్యాలయాలు, హోటళ్లలో కాఫీ డే పేరిట 38,810 వెండింగ్‌ మెషిన్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:

2022-23 క్యూ1లో జీడీపీ వృద్ధిరేటు 13.5%

ఇకపై దిల్లీ, కోల్​కతా నుంచి హైదరాబాద్​కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్

Last Updated : Sep 1, 2022, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.