Air India Offers 2023 : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఆగస్టు 17న '96 గంటల సేల్'ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణం చేసేవారికి బంపర్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు చేసే విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
రూ.1470కే విమానం టికెట్!
Air India Ticket Price : ఎయిర్ ఇండియా దేశీయ విమాన మార్గాల్లో (Air India 4 Day Sale 2023) ఎకానమీ క్లాస్ టికెట్స్‌ను రూ.1,470 ప్రారంభ ధరతో అందిస్తోంది. బిజినెస్ క్లాస్ టికెట్లను రూ.10,130లకు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి సైతం ఇదే విధమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది.
బోనస్ పాయింట్స్ కూడా!
Air India Latest Offer : ప్రయాణికులు ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్లను పొందాలంటే.. ముందుగా airindia.com వెబ్సైట్లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎయిర్ ఇండియా మొబైల్ యాప్‌లోనూ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యాప్‌లో విమానం టికెట్స్ బుక్స్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీజు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక వేళ ప్రయాణికులు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటే.. వారికి డబుల్ లాయల్టీ బోనస్ కూడా అందిస్తారు.
బుకింగ్ టైమింగ్స్
Air India Ticket Booking : ఆగస్టు 17న ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 రాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకున్నవారు 2023 సెప్టెంబర్ 1 నుంచి 2023 అక్టోబర్ 31 వరకు ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులు కేవలం ఎయిర్ ఇండియా వెబ్సైట్, యాప్‌లలో మాత్రమే కాకుండా.. ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్ (OATs) ద్వారా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
స్పైస్‌జెట్ వర్సెస్ ఎయిర్ ఇండియా
Independence Day Spice Jet Offers : స్పైస్‌జెట్ ఇండిపెండెన్స్ సేల్ పేరుతో విమాన ప్రయాణికులకు ఆఫర్స్ ప్రకటించింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా కూడా ఆఫర్స్ ప్రకటించడం గమనార్హం. స్పైస్‌జెట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా రూ.1515 ప్రారంభ ధరలో విమానం టికెట్లు విక్రయిస్తోంది. ఈ టికెట్స్ బుక్ చేసుకున్నవారు 2023 ఆగస్టు 15 నుంచి 2024 మార్చి 30 వరకు విమాన ప్రయాణాలు చేయవచ్చు.