7th Pay Commission DA Hike : కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు ఉద్యోగులకు DA(డియర్ నెస్ అలయెన్స్), పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంచుతూ ఉంటుంది. అయితే.. ఈ ఏడాది రెండో దఫా ప్రకటన ఆలస్యమైంది. దీంతో.. ఈ పెంపు ఎప్పుడు ఉంటుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తూ వచ్చారు. ఇన్నాళ్లూ వేచి చూసిన వీరికి.. కేంద్ర ప్రభుత్వం దసరా పండగ వేళ శుభవార్త చెప్పింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. 7వ వేతన సంఘం చేసిన డీఏ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం.. ఉద్యోగులకు 4 శాతం డీఏను పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఉన్న 42 శాతం ఉన్న డీఏ, డీఆర్ 46 శాతానికి పెరిగింది.
7th Pay Commission DA Hike for Employees : కొవిడ్ ప్రభావం తరువాత దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. దీన్ని కట్టడి చేయడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతగానో కృషి చేస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులతోపాటు ఉద్యోగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఏ స్థాయిలో డీఏ పెంచుతుందా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
ప్రతిఏటా రెండుసార్లు..
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతీ సంవత్సరమూ రెండు సార్లు.. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంచుతుంది. జనవరిలో ఒకసారి జూలై నెలలో మరోసారి ఈ పెంపు ఉంటుంది. ఈ ఏడాదిలో రెండోసారి పెంపు కాస్త అలస్యంగా జరిగింది. ఈ డియర్‌నెస్ అలవెన్స్ (DA)తో.. దేశంలోని దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందుతారని అంచనా. ప్రస్తుతం దేశమంతా ప్రజలు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు.. డీఏ పెంపుతో ఉద్యోగులు, పెన్షన్‌దారులు రెట్టింపు సంబరాలు చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఎలా లెక్కిస్తారు?
సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను ఉద్యోగి బేసిక్ సాలరీలో ఒక శాతంగా లెక్కిస్తారు. DAను కంప్యూటింగ్ చేయడానికి, గత 12 నెలలకు సంబంధించిన ఆల్-ఇండియా కన్‌స్యూమర్ ఇండెక్స్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ప్రకటించిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు.
4% డీఏ పెంపుతో.. జీతం ఎంత పెరుగుతుంది?
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగింది. అంటే.. మొత్తం డీఏ 46 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ సాలరీ అనేది రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ శాలరీ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఎంత వరకు పెరిగే ఛాన్స్ ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం.
- కనీస వేతనం 18 వేల రూపాయలుగా ఉన్నవారికి.. నెలకు DA రూ.720 వరకు పెరుగుతుంది. అంటే.. ఏడాదికి రూ. 8,640 వరకు అందుకుంటారు.
- బేసిక్ శాలరీ రూ. 56,900 ఉన్నవారు.. నెలకు 2,276 పొందుతారు. సంవత్సరానికి 27,312 రూపాయలు అందుకుంటారు.
- ఈ విధంగా ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి.. వారు అందుకునే వేతనం పెరుగుతూ ఉంటుంది.
- ప్రస్తుతం పెంచిన డీఏను జూలై 1, 2023 నుంచి అమలు చేస్తారు.
7th Pay Commission Central Govt Employees DA Hike : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ అంతనా..?
7th Pay Commission Announced DA Hike Date : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ.. దసరా బొనాంజా..?