ETV Bharat / business

Stock market Live: ఒడుదొడుకుల్లో స్టాక్​ మార్కెట్లు

Stock market Live UPDATES
స్టాక్​ మార్కెట్​ లైవ్
author img

By

Published : Mar 8, 2022, 9:26 AM IST

Updated : Mar 8, 2022, 2:17 PM IST

14:10 March 08

నష్టాల్లో నుంచి స్టాక్​ మార్కెట్లు స్వల్పంగా తేరుకున్నాయి. సెన్సెక్స్​ 77 పాయింట్ల లాభంతో 52,920 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 15,865 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ఐటీ, ఫార్మా షేర్లు పుంజుకోవడం స్టాక్​మార్కెట్​కు కలిసివచ్చింది.

11:54 March 08

స్టాక్​ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 401 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 52,441 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 135 పాయింట్ల నష్టానికి 15727 వద్ద ట్రేడవుతోంది.

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చమురు ధర స్థిరంగా కొనసాగుతోంది. నష్టాల నేపథ్యంలో మదుపర్లు.. ఆటోమొబైల్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, బ్యాంకింగ్​ రంగాల షేర్లను విక్రయిస్తున్నారు. మరోవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

లాభనష్టాల్లో..

టీసీఎస్​, టెక్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్, సిప్లా లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంక్​, మారుతీ సుజుకీ, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ నష్టపోయాయి.

10:43 March 08

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్నాయి. కోలుకున్నట్లే కనిపించిన సూచీలు మళ్లీ నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్​ 155 పాయింట్లు కోల్పోయి 52,687 వద్ద కొసాగుతుండగా.. నిఫ్టీ 53 పాయింట్ల నష్టానికి 15,809 వద్ద ట్రేడవుతోంది.

10:11 March 08

లాభాల్లో ఇన్ఫీ, అదానీ పోర్ట్స్​

ఒడుదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 130 పాయింట్లు లాభపడి 52,974 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 15,890 వద్ద ట్రేడవుతోంది.

ఎన్​టీపీసీ, టీసీఎస్​, టెక్​ఎం, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

హిందాల్​ కో, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:57 March 08

Stock market Live: నష్టాల్లో సూచీలు

Stock Market: ఉక్రెయిన్​పై రష్యా దాడులు కొనసాగడం, అంతర్జాతీయంగా ప్రతికూలతల నేపథ్యంలో.. మంగళవారం కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 107 పాయింట్ల నష్టంతో 52,735 వద్ద ట్రేడవుతోంది.

ఎన్​ఎస్​ఈ నిఫ్టీ కూడా 48 పాయింట్లు కోల్పోయి 15,814 వద్ద కొనసాగుతోంది.

సోమవారం రష్యా, ఉక్రెయిన్​ మధ్య జరిగిన మూడో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం కూడా మార్కెట్లు ఒడుదొడుకులకు కారణం.

Last Updated : Mar 8, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.