అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన బాంబే ఎక్స్చేంజీ సూచీ ఒక దశలో 160 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 87 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 36 వేల 382 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
జాతీయ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయింది. 10 వేల 865 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఆటో, లోహ వాటాలపై అమ్మకాల ఒత్తిళ్లు నష్టాలకు మరో కారణం.
అత్యధిక లాభనష్టాల్లోనివివే....
ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. సుమారు 2.39 శాతానికి పైగా వృద్ధి చెందాయి.
యస్ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ 3.25 శాతం క్షీణించాయి.
రూపాయి పతనం
రూపాయి ఆరంభ ట్రేడింగ్‌లోనే భారీగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 71.73 వద్ద ఉన్న మారకం విలువ 48 పైసలు క్షీణించింది.