ETV Bharat / business

బంగారంపై అప్పు X పర్సనల్​ లోన్.. ఏది బెటర్​? - పర్సనల్​లోన్ మంజూరుకు ఎంత సమయం పడుతుంది

సమయానికి డబ్బు చేతిలో లేనప్పుడు అప్పు తీసుకోవడం ఇప్పుడు అత్యంత సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. బంగారాన్ని తాకట్టు పెట్టి కొంత మంది రుణం తీసుకుంటే.. మరికొంత మంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. మరి ఈ రెండింటిలో ఏది బెటర్? అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

Which type is better for small loans
చిన్న రుణాలకు ఏది బెటర్​
author img

By

Published : Jul 26, 2021, 8:34 AM IST

కరోనా వల్ల చాలా మంది ఆదాయాలు తగ్గాయి.. ఇదే సమయంలో ఆర్థిక అవసరాలు పెరిగాయి. దీనితో వారంతా రుణాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రుణాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బంగారం తనఖా పెట్టి తీసుకునేవి. పర్సనల్​ లోన్. మిగతా రుణాలతో పోల్చితే వీటిని పొందటం కాస్త సులువు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ.

మరి బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాలు, పర్సనల్ లోన్స్​.. వేటి ద్వారా అప్పు తీసుకునే వారికి ప్రయోజనం? వేటిలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి? అనే విషయాలతో పాటు ఈ రెండు రకాల రుణ సదుపాయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

బంగారంపై రుణాలు

  • మంజూరు, చెల్లింపు చాలా సులభంగా అవుతుంది.
  • ఇది సెక్యూర్డ్ రుణం కాబట్టి క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.
  • రిపేమెంట్​కు సంబంధించి ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి.
  • తనాఖా పెడుతున్న బంగారంలో 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు.
  • రుణ ఈఎంఐ చెల్లించనట్లయితే బ్యాంకులు/రుణ సంస్థలకు తనఖా పెపట్టిన బంగారాన్ని విక్రయించుకునే అధికారాలు ఉంటాయి.
  • వడ్డీ రేట్లు 9.50 శాతం నుంచి 29 శాతం వరకు ఉంటాయి.
  • సాధారణంగా ప్రాసెసింగ్ సమయం 24-48 గంటలుగా ఉంటుంది.
  • ఈ రుణాలకు తిరిగి చెల్లించే వ్యవధి తక్కువగా ఉంటుంది.

పర్సనల్ లోన్

  • తనాఖా ఉండదు కాబట్టి సెక్యూర్డ్ రుణం కాదు.
  • పర్సనల్ లోన్​ రావాలంటే క్రెడిట్ స్కోరు, హిస్టరీ అనేది కీలకం.
  • వడ్డీ రేటు బంగారంపై రుణంతో పోల్చితే కొంత ఎక్కువగా ఉండొచ్చు.
  • క్రెడిట్ స్కోరు, హిస్టరీ, వేతనం ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయం అవుతుంది.
  • మూడు నుంచి ఏడు రోజుల్లో రుణం ప్రాసెసింగ్ అవుతుంది.
  • రుణం తిరిగి చెల్లించే వ్యవధి ఎక్కువగా ఉంటుంది.
  • 10.25 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.

బంగారం తనఖా రుణాలపై వివిధ బ్యాంకులు, రుణ సంస్థల్లో వడ్డీ రేట్లు

బ్యాంక్​/రుణ సంస్థవడ్డీ రేటు
ఐసీఐసీఐ బ్యాంక్10%-19.76%
యాక్సిస్ బ్యాంక్12.50%- 17.50%
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్9.50%-17.15%
కెనరా బ్యాంక్కనీసం 7.65%
ముత్తుట్ ఫినాన్స్12%-27%
ఎస్​బీఐకనీసం 7.50%
కోటక్ మహీంద్రా బ్యాంక్10%-17%
ఇండస్ ఇండ్ బ్యాంక్10.50%-16%
మణప్పురం గోల్డ్ లోన్29% వరకు
బ్యాంక్ ఆఫ్ బరోడా9.1%-9.25%
పీఎన్​బీ గోల్డ్ లోన్8.75%-9%

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.