ETV Bharat / business

ఆదాయపు పన్ను లెక్కించటం ఎలా...? - గణన

ఆదాయపు పన్ను గణన సహజంగానే అనేక సందేహాలు ఉంటాయి. ఇటీవల బడ్జెట్​ సందర్భంగా రిబేటు పెంచారు. ప్రస్తుతం ఐటీ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని ఎలా గణించాలి? ఎంత ఆదాయపు పన్ను కట్టాలి అనేది తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను
author img

By

Published : Feb 3, 2019, 4:51 PM IST

శుక్రవారం నాడు బడ్జెట్​ ప్రసంగంలో ఆదాయపు పన్ను రిబేటును 5 లక్షలకు పెంచినట్లు ప్రసంగించారు. అయితే ప్రజల్లో ఇది పన్ను మినహాయింపేనా? కాదా? అనే సందేహాలు తలెత్తాయి.

మినహాయింపు అంటే అసలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రిబేటు అంటు ఒక సబ్సిడీ లాంటిది. అనగా పన్ను చెల్లింపులో కొంత సబ్సిడీ అన్నట్లు.

చట్ట పరంగా...

రిబేటును ఆదాయపు పన్ను చట్టంలోని 87ఏ తెలుపుతోంది. ఇప్పడు ప్రవేశపెట్టిన ఫైనాన్స్​ బిల్లు ప్రకారం ఈ సెక్షన్​కు సవరణలు చేయనున్నారు. ఇంతకుముందు రూ. 3.5 లక్షల ఆదాయంపై రూ. 2,500 రిబేటు ఉండేది.

మధ్యంతర బడ్జెట్​ ఈ రిబేటును రూ. 12,500లకు పెంచింది. ఆదాయం స్థాయిని రూ.5లక్షలకు పెంచింది.

రిబేటు ఇలా...

బడ్జెట్​ ప్రసంగంలో రూ.5లక్షల పరిమితి వరకు పూర్తి రిబేటు పొందుతారని పీయూష్​గోయల్​ ప్రకటించారు. ప్రస్తుతం రూ.2,50,001 నుంచి రూ. 5లక్షల వరకు 5శాతం పన్ను ఉంది.

2014 బడ్జెట్​లో ఆదాయపు పన్ను పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. అనంతరం 5 లక్షల వరకు 12,500 రూపాయల పన్ను పడుతోంది. దీన్ని ఇప్పుడు రిబేటుగా ప్రకటించారు. దీనితో మొత్తం నికరంగా పన్ను సున్నాకు చేరుతోంది.

పన్ను గణన ఇలా....

ఉదాహరణకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నారనుకోండి. రూ. 5,00,001 నుంచి 10 లక్షల వరకు 20శాతం పన్ను స్థాయి ఉంది. రూ.10,00,001 నుంచి 30 శాతం పన్ను ఉంది. దీని ప్రకారం పన్ను గణించటం ఎలానే తెలుసుకుందాం...

undefined

మొత్తం 8 లక్షల్లో ప్రామాణిక మినహాయింపు రూ. 50వేలు. ఇది తీసివేయగా ఆదాయం రూ. 7.5 లక్షలు. ఇందులో నుంచి ప్రత్యేక పెట్టుబడుల (సెక్షన్​ 80సీ) కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ప్రజా భవిష్య నిధి, బీమాతో పాటు ఇంటి అద్దెలు తదితరాలు సెక్షన్​ 80సీలో ఉన్నాయి.

7.5 లక్షల నుంచి 1.5 లక్షలను తీసివేయగా ఇప్పుడు ఆదాయం రూ. 6 లక్షలు. ఇందులో జాతీయ పింఛను పథకం కింద 50వేల రూపాయలు మినహాయింపు ఉంది. ఇంటి రుణంపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనితో అంతిమంగా పన్ను విధించే ఆదాయం రూ. 3.5లక్షలకు చేరింది. ఆదాయం రూ.5లక్షలకు తక్కువగా ఉన్నందున ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.