ETV Bharat / business

కరోనా ప్రభావంతో రిటైల్​ రుణాల్లో అనూహ్య వృద్ధి! - బంగారం తాకట్టుతో రుణాలు

కరోనా ప్రభావంతో ఏడాదిన్నర కాలంగా.. ఎంతోమందికి స్థిరమైన ఆదాయాలు లేకపోవటం వల్ల బంగారం తనఖా పెట్టి, లేదా వ్యక్తిగత పూచీకత్తు మీద ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నారు. అధిక వడ్డీరేటు వసూలు చేసే ఫిన్‌టెక్‌ సంస్థలు ఇస్తున్న రుణాల్లో గత కొంతకాలంలో అనూహ్య వృద్ధి చోటుచేసుకుంది. అవసరం మేరకు ఇటువంటి సంస్థల నుంచి చిన్న రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది.

retail loans in india
రిటైల్​ రుణాలు
author img

By

Published : Jul 21, 2021, 6:53 AM IST

కొవిడ్‌-19 ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయిన ఎన్నో కుటుంబాలు తమ తక్షణ అవసరాల కోసం అప్పుల వేటలో నిమగ్నమవుతున్నాయి. బంగారం తనఖా పెట్టి, లేదా వ్యక్తిగత పూచీకత్తు మీద ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నారు. బ్యాంకుల రుణాల తీరుతెన్నులను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇంకా పూర్తిగా కోలుకోని ఫలితమే ఇదని.. ఏడాదిన్నర కాలంగా ఎంతోమందికి స్థిరమైన ఆదాయాలు లేకపోవటం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోందని సమాచారం. అయితే రిటైల్‌ రుణాలు పెరగడం తాజా పరిణామం కాదని, గత దశాబ్దకాలంగా గణాంకాలను విశ్లేషిస్తే, రిటైల్‌ రుణాలు ఏటేటా పెరుగుతున్నాయని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో రిటైల్‌ రుణాలు ఇంకా పెరిగేందుకు కొవిడ్‌-19 పరిణామాలు కారణమైనట్లు వివరిస్తున్నాయి.

  • ఈ ఏడాది మార్చి ఆఖరుకు మనదేశంలోని బ్యాంకులు జారీ చేసిన మొత్తంలో రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 29 శాతం ఉంది. దశాబ్దకాలం క్రితం ఇది 18 శాతమే. అదే సమయంలో బ్యాంకులు ఇచ్చిన కార్పొరేట్‌ రుణాల వాటా మొత్తం రుణాల్లో 45 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.
  • గత దశాబ్దకాలంలో బ్యాంకులు జారీ చేసిన రిటైల్‌ రుణాలు ఏటా 15.5% చొప్పున పెరగ్గా, కార్పొరేట్‌ రుణాల్లో 4.5% వృద్ధి మాత్రమే కనిపించింది. 2015 తర్వాత కార్పొరేట్‌ రుణాల జారీ బాగా తగ్గిపోయింది.

తక్కువ మొత్తం అప్పులు పెరుగుతున్నాయి

గత ఏడాదిన్నర కాలంలో బ్యాంకులు జారీ చేసిన రుణాలు తీరుతెన్నులను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైల్‌, వ్యవసాయం- వ్యవసాయ అనుబంధ విభాగాలకు బ్యాంకులు అధికంగా అప్పులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సేవల రంగానికి, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం తగ్గింది. రిటైల్‌ రుణాల్లోనూ.. బంగారం తనఖా పెట్టి తీసుకున్న అప్పులు, వ్యక్తిగత రుణాలు అధికంగా ఉన్నాయి. పైగా తక్కువమొత్తం అప్పులు (రూ.25,000 నుంచి రూ.50,000 వరకూ) తీసుకోవడం బాగా పెరిగింది. అధిక వడ్డీరేటు వసూలు చేసే ఫిన్‌టెక్‌ సంస్థలు ఇస్తున్న రుణాల్లో గత కొంతకాలంలో అనూహ్య వృద్ధి చోటుచేసుకోవడం ఒక ముఖ్యమైన అంశం. అవసరం మేరకు ఇటువంటి సంస్థల నుంచీ చిన్న రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిలో 69 శాతం మంది 30 ఏళ్ల లోపు యువకులే. ఉద్యోగం/ ఉపాధి కోల్పోయిన యువకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి రుణాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

రాని బాకీల ముప్పు

రిటైల్‌ రుణాలు మరీ అధికంగా పెరిగిపోవడం అంత మంచి సంకేతం కాదనే అభిప్రాయాన్ని కొందరు బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయని, బ్యాంకులకు రానిబాకీల బెడద ఎదురవుతుందని అంటున్నారు. ఎటువంటి ఆస్తి తనఖా లేకుండా, వ్యక్తిగత హామీ మీద ఇచ్చే రుణాలకు నష్టభయం ఎక్కువగా ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌-19 ముప్పు పూర్తిగా తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొని ఉద్యోగ/ ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు రిటైల్‌ రుణాల నుంచి మొండి బాకీల ముప్పు తగ్గుతుందని, అప్పటి వరకు ఇబ్బందేనని అంటున్నారు. కార్పొరేట్‌ రుణాల జారీ మరీ తగ్గడమూ మంచిది కాదని, కార్పొరేట్‌ రుణాలు పెరిగితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని బ్యాంకింగ్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నుంచి కార్పొరేట్‌ రుణాల జారీ పెరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఉద్యోగులకు డీఏ పెంపుపై కేంద్రం కీలక ఆదేశాలు

ఇదీ చూడండి: ఇలా చేస్తే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.