ETV Bharat / business

చితికిపోతున్న చిన్న పరిశ్రమలు.. చర్యలు తక్షణావసరం - భారత్​లో చితికిపోతున్న చిన్న పరిశ్రమలు

Small Scale Industries: స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం, ఎగుమతుల్లో 45శాతానికి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమకూరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈలు సుమారు 12 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. వస్తువులు, సరకుల తయారీ, ఉత్పత్తి, నిర్వహణ, సంరక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ఈ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి ఈ పరిశ్రమ ఇప్పుడు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అండగా నిలవాల్సిన సమయం ఇది.

small scale industries
చిన్న పరిశ్రమలు
author img

By

Published : Dec 28, 2021, 8:00 AM IST

Small Scale Industries: భారత తయారీ సామర్థ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా మూడో వంతుకు పైగా ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం, ఎగుమతుల్లో 45శాతానికి పైగా అవే సమకూరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈలు సుమారు 12 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. వస్తువులు, సరకుల తయారీ, ఉత్పత్తి, నిర్వహణ, సంరక్షణ రంగాల్లో సేవలందిస్తున్న ఈ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దేశార్థికానికి వెన్నెముక వంటి ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నా- ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికం చేసి వాటిని మరింతగా వృద్ధి చేసేందుకు అవి సరిపోవడం లేదు.

ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం

కొవిడ్‌ కారణంగా దేశంలోని 35శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడ్డాయని, స్వయంఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో 37శాతం వరకు తమ వ్యాపారాలను మూసేశారని అఖిల భారత తయారీదారుల సంఘం సర్వే నిగ్గుతేల్చింది. పోనుపోను కొండెక్కుతున్న ముడిసరకుల ధరలు ఎంఎస్‌ఎంఈలను చిదిమేస్తున్నాయి. గిరాకీ లేకపోయినప్పటికీ ధరలు పెరుగుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పలు కారణాలతో దిగుమతులు కోసుకుపోవడమూ ప్రభావం చూపుతోంది. అదే అదునుగా దేశీయ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేశారు. ఈ పరిణామాలు వస్తుసరకుల రంగంలోని బడా కంపెనీలకు మేలు చేసినా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అవి పెనువిఘాతాలయ్యాయి. ఉక్కు, ఇనుముపై అధికంగా ఆధారపడే ఇంజినీరింగ్‌ పరిశ్రమలు చితికిపోయాయి. రాబోయే కొద్ది రోజుల పాటు ధరల పెరుగుదల ఇలాగే ఉంటే ఆయా సంస్థల లాభాలు కోసుకుపోతాయి. ఈ దుస్థితి దీర్ఘకాలం కొనసాగితే మరింత చేటు తప్పదు! పరిశ్రమలు ముడిసరకులకు బదులుగా పూర్తిగా తయారైన వస్తువుల దిగుమతి వైపే మొగ్గుచూపవచ్చు. ఆత్మనిర్భర్‌ కార్యక్రమం ద్వారా ప్రపంచ తయారీ రంగంలో భారత భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అది విఘాతమవుతుంది. ముడిసరకుల ధరలు దిగిరాకపోతే పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలకు భారీస్థాయిలో కోతపడవచ్చు. అంతిమంగా ఇవన్నీ కలిసి దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం నెలకొంది. భారత్‌తో పోలిస్తే వస్త్రాల ఎగుమతిలో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ ముందంజలో ఉంది. దేశీయ తయారీదారులకు అక్కడి ప్రభుత్వం సమధికంగా చేయూతనివ్వడమే అందుకు కారణం! ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం అత్యవసర రుణహామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) ప్రవేశపెట్టింది. దాని కింద వ్యాపార రుణాలకు ప్రభుత్వ హామీ లభిస్తోంది. 2021 సెప్టెంబర్‌ నాటికి రూ.2.86 లక్షల కోట్ల మేరకు రుణాలు మంజూరయ్యాయి. భారతీయ ఎంఎస్‌ఎంఈల్లో చాలాకొద్ది శాతమే ఈసీఎల్‌జీఎస్‌ను వినియోగించుకున్నాయి. ఇప్పటికే అప్పుల భారంతో కుదేలవుతున్న పరిశ్రమలు, కొత్త రుణాలు తీసుకునేందుకు వెనకాడుతున్నాయి.

వేధిస్తున్న వనరుల లేమి

కీలకమైన పది ముడిసరకుల ధరలను నిశితంగా గమనిస్తూ, అవసరమైతే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు సిఫార్సు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఇటీవల కేంద్రాన్ని అభ్యర్థించింది. దిగుమతి సుంకాలను హేతుబద్ధీకరించి, అత్యవసర ముడిసరకులపై పన్నులను తొలగించాలని అది కోరుతోంది. మహమ్మారి మూలంగా రుణాల చెల్లింపులో వెనకబడ్డ ఎంఎస్‌ఎంఈలకు మరికొద్ది కాలం పాటు మినహాయింపులు కల్పించాలని పరిశ్రమవర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు, ఐటీ సేవలను పొందడంలో వనరుల లేమి పరిశ్రమ ఎదుగుదలకు ప్రతికూలమవుతోంది. పన్ను రిటర్నులు, చెల్లింపులు, ఆర్డర్లపై ఆ ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ఐటీ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడానికి ఎంఎస్‌ఎంఈల యాజమాన్యాలు ప్రయత్నించాలి. నూతన సాంకేతికతను అర్థం చేసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి అది అక్కరకొస్తుంది. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఐటీ కేంద్రాల ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వమూ ఎంఎస్‌ఎంఈల నిర్వాహకులకు తగిన తోడ్పాటు అందించాలి. కష్టాల కడలిలోంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఒడ్డున చేర్చేందుకు కేంద్ర సర్కారు సమగ్ర విధానానికి రూపకల్పన చేయాల్సి ఉంది. ముడిసరకుల ధరలను నియంత్రించడంపై దృష్టి సారించడమూ అత్యవసరం. అదే సమయంలో తమ సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసుకోవడానికి యువ వ్యాపారవేత్తలు కృషిచేయాలి. మార్కెటింగ్‌ నైపుణ్యాలకు మరింతగా పదునుపెట్టుకోవాలి.

-పీవీ రావు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు

ఇదీ చూడండి: టాటాకు ఎయిర్​​ ఇండియా అప్పగింత మరింత ఆలస్యం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.