High speed electric scooter: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వన్‌మోటో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ముందుకొచ్చింది. 'ఎలెక్టా' పేరుతో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత విపణిలో విడుదల చేసింది. గత నెలలో బైకా, కమ్యూటా పేర్లతో రెండు మోడల్స్‌ను లాంచ్ చేసిన సంస్థ.. తాజాగా ప్రీమియం విద్యుత్ స్కూటర్ ఎలెక్టాను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.2 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది.
జియో ఫెన్సింగ్, ఐఓటీ, బ్లూటూత్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహా పలు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఎలెక్టాను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఎలెక్టాలో 72 వోల్ట్, 45 ఆంపియర్ డిటాచబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీని అమర్చినట్లు వెల్లడించింది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవవచ్చు. గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగల ఎలెక్టాలో 4కేడబ్ల్యూ క్యూఎస్ బ్రష్‌లెస్ డీసీ హబ్ ఉంది.
ఎలెక్టా.. మ్యాట్ బ్లాక్, షైనీ బ్లాక్, నీలం, ఎరుపు, బూడిద రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో డిస్ప్లే అనలాగ్ రూపంలో ఉంటుంది. హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులతో రూపొందించిన ఈ స్కూటర్‌కు(మోటార్, కంట్రోలర్, బ్యాటరీ) సంస్థ మూడేళ్లు వారంటీ ఇస్తుంది.
వన్‌మోటో సంస్థ నుంచి అత్యంత ఖరీదైన మోడల్ ఇదే కావడం విశేషం. ఎలెక్టా కన్నా ముందు విపణిలో విడుదలైన రెండు మోడళ్ల ధరలు తక్కువే. బైకా మోడల్ ధర రూ.1.80 లక్షలు ఉండగా.. కమ్యూటా రూ.1.30 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉంది.
ఇదీ చూడండి: రూ.36 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్- ఫీచర్స్ అదుర్స్!