ETV Bharat / business

ఎల్​ఐసీ పని దినాలు ఇక వారంలో ఐదే! - ఎల్​ఐసీ తాజా వార్తలు

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ.. ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.

LIC Office
ఎల్​ఐసీ, లైఫ్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా
author img

By

Published : May 6, 2021, 2:21 PM IST

Updated : May 6, 2021, 2:30 PM IST

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్​ఐసీ) ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేయనుంది. గతంలో పని దినంగా ఉన్న శనివారాన్ని కూడా సెలవుగా ప్రకటించడమే ఇందుకు కారణం.

గత నెల 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్​ ప్రకారం.. ఎల్​ఐసీకి ప్రతి శనివారం సెలవు. ఈ నిబంధనల్ని ఈ నెల 10 నుంచి అమలు చేయనున్నట్టు బీమా సంస్థ ప్రకటించింది. తమ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం(ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు) వరకే పనిచేస్తాయని.. పాలసీదారులు, ఇతర వాటాదారులు ఈ రోజుల్లోనే తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఎల్​ఐసీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఎన్ని తీసుకుంటే మేలు..?

Last Updated : May 6, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.