ETV Bharat / business

కోటి యూజర్ల 'కూ'- న్యూస్​ సైట్​కు యాహూ గుడ్​ బై - యాహూ న్యూస్ సైట్​ నిలిపేందుకు కారణాలు

దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్ 'కూ'​ మరో ఘనతను సాధించింది. యాప్ ఆవిష్కరించిన 16 నెలల్లోపే కోటి యూజర్లను (Koo user base now) సాధించింది. మరోవైపు మీడియా పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో కేంద్రం చేసిన మార్పులతో యాహూ.. భారత్​లో న్యూస్​ సైట్​ కార్యకలాపాలను నిలిపివేసింది.

Koo Micro blogging app
కూ మైక్రో బ్లాగింగ్ యాప్​
author img

By

Published : Aug 26, 2021, 1:19 PM IST

Updated : Aug 26, 2021, 2:11 PM IST

ట్విట్టర్​కు పోటీగా వచ్చిన దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ 'కూ' మరో మైలురాయిని దాటింది. తాజాగా కూ యూజర్ బేస్​ కోటి దాటినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ పేర్కొన్నారు. మరో ఏడాది కాలంలో 10 కోట్ల యూజర్​ బేస్​ను అందుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

కూ యాప్​ను ఆవిష్కరించిన 15-16 నెలల్లోనే యూజర్ బేస్ ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 85 లక్షల డౌన్​లోడ్​లను సాధించింది కూ యాప్​.

యాహూ న్యూస్ బంద్​..

ప్రముఖ వెబ్​ సర్వీస్​ ప్రొవైడర్​ యాహూ భారత్​లో తన న్యూస్​ వెబ్​సైట్​ కార్యకలాపాలు నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్​డీఐ) నిబంధనల కారణంగా.. వార్తా సేవలు కొనసాగించలేకపోతున్నామని ప్రకటించింది. గురువారం (ఆగస్టు 26) నుంచే తమ న్యూస్​ వెబ్​సైట్(భారత్​లో)​లో కంటెంట్ పబ్లిష్​ అవదని పేర్కొంది.

న్యూస్​, యాహూ క్రికెట్​, ఫినాన్స్, ఎంటర్​టైన్మెంట్​, మేకర్స్​ ఇండియా సేవలు ఇకపై భారత్​లో నిలిపివేస్తున్న సేవలని పేర్కొంది యాహూ. అయితే ఈ నిర్ణయంతో యాహూ ఈమెయిల్​, సెర్చ్ సేవలకు ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. మీడియా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం వరకే ఉండాలి. ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు అక్టోబర్​ నుంచి అమలులోకి రానున్నాయి.

ఇదీ చదవండి: ఐటీఆర్‌-1 ఎవ‌రు దాఖ‌లు చేయొచ్చు.. ఎవ‌రికి వర్తించదు?

Last Updated : Aug 26, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.