ETV Bharat / business

యువత.. పెట్టుబడులు పెడుతున్నారా?

20 నుంచి 30 ఏళ్ల వయసు జీవితంలో చాలా కీలకమైనది. సాధారణంగా ఈ వయసులోనే ఉద్యోగం, వివాహం జరుగుతుంటాయి. అంతేకాకుండా సంపద సృష్టించేందుకు కూడా ఈ వయసులోనే మొదటి అడుగులు పడుతుంటాయి. ఈ వయస్సు వారి రిటైర్మెంట్​కు చాలా సమయం ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎక్కువగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వారు ఎలాంటి పెట్టుబడి సాధానాలు ఎంచుకుంటే మేలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్టుబడులు
పెట్టుబడులు
author img

By

Published : Aug 16, 2021, 6:20 PM IST

ఎంత రిస్కు తీసుకుంటే అంత రాబడి ఉంటుంది. అంటే ఎక్కువ రిస్కు తీసుకుంటే ఎక్కువ లాభాలను అర్జించవచ్చు. తక్కువ తీసుకుంటే తక్కువ లాభాలను అర్జించవచ్చు. ఇది సాధారణంగా ఏ పెట్టుబడికైనా వర్తిస్తుంది. అయితే అందరికీ రిస్కు తీసుకునే సామర్థ్యం ఉండదు. రిస్కు తీసుకునే వారు అలాంటి పెట్టుబడులను ఎంపిక చేసుకొని ఎక్కువ లభాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వయసు రీత్యా చూసుకుంటే.. కొందరికి రిస్కు తీసుకోవటం కుదరదు. రిటైర్మెంట్ దగ్గరున్న వారు రిస్కు తీసుకోవటం వల్ల స్వల్ప కాలంలో నష్టాలు వచ్చినట్లయితే ఆదాయం ఉండదు కాబట్టి ఇబ్బందులు పడాల్సి ఉండదు. అదే ఉద్యోగ జీవితం ప్రారంభించిన వారు ఎక్కువగా రిస్కు తీసుకోవచ్చు. వీరికి స్వల్ప కాలంలో నష్టాలు వచ్చినప్పటికీ.. ఆదాయం ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతారు. సాధారణంగా 20-30 ఏళ్ల మధ్యలో ఉద్యోగ జీవితం ప్రారంభం అవుతుంది. వీరి రిటైర్మెంట్​కు చాలా సమయం ఉంటుంది. కాబట్టి రిస్కు తీసుకొని పెట్టుబడులు పెట్టాలి. ఎలాంటి పెట్టుబడులు వీరికి సరిపోతాయో చూద్దాం.

ఈక్విటీ ఫండ్లు..

సాధారణంగా ప్రత్యక్షంగా ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం అనేది చాలా రిస్కుతో కూడుకున్నది. ఇందులో కూడా పలు రకాలు ఉంటాయి. తక్కువ రిస్కు నుంచి ఎక్కువ రిస్కు, భారీ రిస్కు ఉన్న స్టాక్స్ ఉంటాయి. బ్లూచిప్ స్టాక్​లలో రిస్కు తక్కువగా ఉంటుంది. అదే సమయంలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్​లలో రిస్కు చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి స్టాక్​ను ఎంచుకోవటం ద్వారా స్వల్ప కాలంలో నష్టాలున్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ఉదాహరణకు ఎమ్ఆర్ఎఫ్ స్టాక్ 2008లో రూ.1700 వద్ద ఉంది. అది ప్రస్తుతం 77వేల స్థాయిలో ఉంది. అంటే మొత్తంగా దాదాపు 4429 శాతం రాబడిని ఇచ్చింది. వార్షికంగా చూసుకుంటే దాదాపు 34 శాతం రాబడిని ఇచ్చింది.

ప్రత్యక్షంగా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టటం అనేది పూర్తి అవగాహనతో కూడుకున్నది. అన్ని విషయాలు తెలుసుకొని పెట్టుబడి పెట్టాలి. లేనిపక్షంలో అడ్వైజర్ సలహాలు, సూచనలు తీసుోకవచ్చు. ఈక్విటీలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అవసరం ప్రకారం మార్పులు చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్లు..

మ్యూచువల్ ఫండ్లలో రిస్కు ప్రత్యక్ష ఈక్విటీతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అదే విధంగా ప్రత్యక్ష ఈక్విటీ కంటే రాబడిని కూడా తక్కువగా ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్లు పలు రకాలు ఉంటాయి. అన్నింటిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రిస్కు ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో మళ్లీ స్మాల్, మిడ్ క్యాప్​లో రిస్కు ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ల స్థాయి వయసు వారు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవటం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఈక్విటీతో పోల్చితే వీటిని తరచూ పరిశీలించాల్సిన అవసరం ఉండదు.

సిప్ ద్వారా నెలవారీగా కొంత మొత్తంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెచ్చొచ్చు. ఇది వేతన జీవులకు సరిపోతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.