ETV Bharat / business

క్యూ3లో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ 17 శాతం వృద్ధి! - స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో షియోమీ వాటా

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ ఈ ఏడాది(2019తో పోలిస్తే) మూడో త్రైమాసికంలో 17 శాతం వృద్ధి సాధించింది. ఇతర ప్రధాన స్మార్ట్​ఫోన్​ మార్కెట్లైన చైనా, అమెరికాల్లో విక్రయాలు పడిపోయినా.. దేశీయంగా మాత్రం వృద్ధి నమోదవ్వడం విశేషం. భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఐడీసీ నివేదిక వెల్లడించిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

Smartphone sales news
సెప్టెంబర్​లో పెరిగిన స్మార్ట్​ఫోన్ల విక్రయాలు
author img

By

Published : Nov 7, 2020, 5:39 AM IST

Updated : Nov 7, 2020, 6:25 AM IST

భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా పుంజుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 17 శాతం వృద్ధితో 5.43 కోట్ల షిప్మెంట్​లు నమోదైనట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో వెల్లడైంది. చైనా, అమెరికా మార్కెట్లలో స్మార్ట్​ఫోన్ల షిప్మెంట్​లు తగ్గినప్పటికీ భారత్​లో మాత్రం వృద్ధి నమోదు కావడం విశేషమని నివేదిక పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • సెప్టెంబర్​ త్రైమాసికంలో షియోమీ 25 మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్ (22.3 శాతం), వీవో (16.7 శాతం), రియల్​మీ (14.7 శాతం), ఒప్పో (11.3 శాతం)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • పండుగ సీజన్​ నేపథ్యంలో పెరిగిన డిమాండ్, స్టాక్స్​ నిల్వపెట్టుకోవడం వల్ల ఈ స్థాయిలో షిప్మెంట్​లు నమోదయ్యాయి.
  • సెప్టెంబర్ త్రైమాసికంలో 2.5 కోట్ల ఫీచర్​ ఫోన్ల షిప్మెంట్​లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి 30 శాతం తక్కువ.
  • వార్షిక ప్రాతిపదికన మాత్రం షిప్మెంట్​లలో వృద్ధి సింగిల్ డిజిట్​కు పరిమితం కావచ్చు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో నమోదైన క్షీణత ఇందుకు కారణం.
  • మొబైల్ ఫోన్ల విక్రయాలలో ఆన్​లైన్ ప్లాట్​ఫామ్స్​ వాటా 48 శాతం వద్ద జీవిత కాల గరిష్ఠానికి చేరింది. ఈ కామర్స్ సంస్థల ప్రమోషన్లు, ప్రత్యేక సేల్స్ ఇందుకు కారణమయ్యాయి.
  • ప్రథమార్ధంలో సవాళ్లు ఎదురైన తర్వాత.. ఆఫ్​లైన్ మార్కెట్లో 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్​లైన్ మార్కెట్​కు సరఫరా సమస్యను ఎదుర్కొంటోంది.

ఇదీ చూడండి:వాట్సాప్​లో ఇక మనీ ట్రాన్స్​ఫర్​... ఫ్రీగా...

Last Updated : Nov 7, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.