ETV Bharat / business

గూగుల్ చరిత్ర మీకు తెలుసా? - లారీ పేజ్‌, సెర్గేయ్‌ బ్రిన్‌

ప్రస్తుతం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా అందరూ ఉపయోగించే సాధనం గూగుల్​. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సెర్చ్​ ఇంజిన్​ కూడా ఇదే కావటం విశేషం. మరి అంతలా పాపులర్​ అయిన గూగుల్​కు అసలు ఆ పేరు ఎలా వచ్చింది? గూగుల్ పేరు వెనుక అసలు ఉద్దేశమేంటి? దాని చరిత్ర ఏంటో చూద్దాం.

History of google
గూగుల్ చరిత్ర
author img

By

Published : Aug 26, 2021, 3:14 PM IST

స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న సందేహం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది గూగుల్‌. మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయిన గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఇట్టే తెలుసుకోవచ్చు. పాఠశాల విద్యార్ధుల నుంచి ఇంట్లో ఉండే తాత, బామ్మల వరకు గూగుల్ గురించి తెలియని వారులేరు. అంత పాపులర్​ అయిన ఈ సెర్చ్​ ఇంజిన్​కు ఆపేరు ఎలా వచ్చింది.. దాన్ని స్థాపించాలనే ఆలోచనకు ఎక్కడ బీజం పడింది వంటి ఆసక్తికర విషయాలను గూగుల్‌ అందులో పేర్కొంది. మరి అవేంటో తెలుసుకుందామా?

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులుగా ఉన్న సమయంలో లారీ పేజ్‌, సెర్గేయ్‌ బ్రిన్‌లకు వచ్చిన ఒక సరికొత్త ఆలోచన గూగుల్‌కు బీజం వేసింది. ఆ రోజుల్లో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ (WWW)లో సమాచారం కోసం ప్రజలు వెతికే విధానాన్ని మరింత మెరుగుపరచాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాని కోసం ఒక సంస్థను స్థాపించాలనుకున్నారు. అలా 1998 సెప్టెంబరు 27 తేదీన లారీ, బ్రిన్‌ ఇద్దరు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. మరి పేరు ఎలా వచ్చిందంటే..

1920లో ఒక రోజు అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ కాస్నర్‌ తన మేనల్లుడు మిల్టన్‌ సిరోట్టాతో 1 తర్వాత వంద సున్నాలు ఉండే అంకెను ఎలా పిలవాలో సూచించమని కోరాడట. అందుకు మిల్టన్‌ గూగోల్ (Googol) అని సమాధానం ఇచ్చాడట. తర్వాత ఆ పదాన్ని కాస్నర్ 1940లో తాను ఉపరచయితగా వ్యవహరించిన 'మేథమెటిక్స్‌ అండ్ ఇమేజినేషన్‌' అనే పుస్తకంలో ప్రస్తావించారు. 1998లో లారీ, బ్రిన్‌లు తమ కంపెనీకి పేరు పెట్టడం కోసం వెతుకుతున్నప్పుడు గూగోల్ గురించి విన్నారట. ఆ పేరు వారికి ఎంతో నచ్చడంతో అందులో కొద్దిగా మార్పులు చేసి గూగుల్ అని పెట్టారట. అంటే సమాచార అన్వేషణకు అంతు లేదు అనేది పేరు వెనక ఉద్దేశం. తర్వాతి కాలంలో ఆ పదం ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. 2006లో అధికారికంగా గూగుల్ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చేర్చారు.

ఇదీ చూడండి: గూగుల్​ క్రోమ్​ వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.