ETV Bharat / business

గూగుల్​ సెర్చ్​లో... మొబైల్​ రీఛార్జ్​ చేసుకోండి! - Google search

గూగుల్ తన వినియోగదారుల కోసం మరో మంచి ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్​ను గూగుల్​లోనే చేసుకునే వీలు కలుగుతుంది.

Mobile recharge facility  in Google search
గూగుల్​ సెర్చ్​లో ... మొబైల్​ రీఛార్జ్​ చేసుకోండి!
author img

By

Published : Feb 7, 2020, 10:51 AM IST

Updated : Feb 29, 2020, 12:16 PM IST

వినియోగదారుల కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనితో ఇకపై మీ మొబైల్​ రీఛార్జ్... గూగుల్ సెర్చ్​లోనే చేసుకోవచ్చు. డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.

ఎలా చేయాలంటే..

ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా మీ ఫోన్​లో డీఫాల్ట్​గా ఉన్న గూగుల్ యాప్​లో 'సిమ్​ రీఛార్జ్​' అని టైప్ చేయాలి. అప్పుడు మొబైల్ రీఛార్జ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో మీ మొబైల్ నెంబర్​, ఆపరేటర్​, సర్కిల్ వంటి వివరాలు నింపి, కింద ఉండే బ్రౌజ్​ ప్లాన్స్​పై క్లిక్ చేయాలి.

అప్పుడు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్​ ప్లాన్​లు అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ప్లాన్​ను ఎంచుకోవాలి. దీని తరువాత మీరు పేమెంట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు గూగుల్ పే, మొబిక్విక్​, పేటీయం, ఫ్రీఛార్జ్​ లాంటి పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో దేని మీదైనా క్లిక్​చేస్తే... మీ ఫోన్​లో సంబంధిత యాప్​కు, లేదా దానికి సంబంధించిన వెబ్​సైట్​కు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీ పేమెంట్ పూర్తిచేయవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రస్తుతం ఈ సౌలభ్యం కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. జియో, ఎయిర్​టెల్, బీఎస్​ఎన్​ఎల్​, వొడాఫోన్​ వినియోగదారులు ఈ ఫీచర్​ను వినియోగించుకోవచ్చు. త్వరలోనే ఎంటీఎన్​ఎల్​ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్.

వీరి కోసం..

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏటంటే.. ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే గూగుల్​ పే యాప్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే గూగుల్​ పే, పేటీయం లాంటి యాప్​ల్లో అందరూ రిజిస్టర్ చేసుకోలేరు కనుక అలాంటి వారికి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: స్టాక్​మార్కెట్ల లాభాల జోరుకు కళ్లెం

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/fadnavis-had-given-green-signal-to-it-nawab-malik-on-land-allotment-issue20200207091210/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.