ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) మానసపుత్రిక, ఆయన కలల ప్రాజెక్టు అయిన అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్సీ)(IFSC) పురోగతి, అభివృద్ధిపై నేడు కీలక చర్చ జరగనుంది. గుజరాత్ ప్రభుత్వం, గిఫ్ట్ సిటీ(GIFT City in Gujarat), ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచస్థాయి ఆర్థిక నిబంధనలు, పోటీతత్వంతో కూడిన పన్ను విధానాలను తీసుకురావడం సహా బలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
వినూత్నమైన, వైవిధ్యమైన ఆర్థిక ఉత్పత్తులు, సేవలను పొందేందుకు గిఫ్ట్ సిటీ(GIFT city news) వీలు కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, బులియన్ ట్రేడింగ్, గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను గిఫ్ట్ సిటీ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అంకురాల ఎదుగుదలకు తోడ్పడే బెస్ట్-ఇన్-లీగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన ఫిన్‌టెక్ యాక్సిలరేటర్స్, ల్యాబ్‌లు గిఫ్ట్ సిటీలో ఉంటాయని వివరించింది. ప్రపంచస్థాయి కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని తెలిపింది.
నిర్మల నేతృత్వంలో..
అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్ఎస్సీ) పురోగతి, అభివృద్ధిపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సాఖ అధికారుల బృందంతో కలిసి అక్కడి గిఫ్ట్ సిటీని సందర్శించనున్నారు. ఆర్థిక శాఖలో ఇద్దరు జూనియర్ మంత్రులు అయిన పంకజ్ చౌధరి, భాగవత్ కిషన్రావ్లు సైతం నిర్మలతో కలిసి చర్చల్లో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: సృజన, నైపుణ్యాల కలబోతతో.. 'గేమింగ్' ఉజ్జ్వల భవిత!