ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన మీరాబాయి చానుకు ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డోమినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవిత కాలం పాటు తమ పిజ్జాను ఫ్రీగా అందించనున్నట్లు వెల్లడించింది. టోక్యోలో పతకం సాధించిన తరువాత పిజ్జా తినాలని ఉందని చాను చెప్పడం వల్ల.. డోమినోస్ ఈ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ మేరకు సంస్థ ట్వీట్ చేసింది.
మీరాబాయి చాను భారత్‌కు వెండి పతకం సాధించినందుకు గాను డోమినోస్ సిబ్బంది ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు పిజ్జాలను అందించారు.
"పిజ్జా తినాలన్న మీ కోరిక గురించి మేము విన్నాము. ఇక మిమ్మల్ని ఏ మాత్రం వేచిచూడనివ్వం. మీకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందించాలని నిర్ణయించాం."
-డోమినోస్ పిజ్జా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది మీరా. మహిళల 49 కేజీల విభాగంలో రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత తొలి వెయిట్ లిఫ్టర్‌గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.
ఇవీ చూడండి:
నాడు మల్లీశ్వరి.. నేడు మీరా.. ఒలింపిక్స్‌లో నారీశక్తి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం- వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం