ETV Bharat / business

Bajaj Dominar 400: బజాజ్​ నుంచి సూపర్ బైక్​.. ఫీచర్స్​ ఇలా... - డొమినార్‌ 400 బైక్‌ వార్త

బజాజ్​ తన కొత్త స్పోర్ట్స్​ బైక్​ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.16 లక్షలు(Bajaj dominar 400 price). బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందిన డొమినార్‌ 400 బైకులు.. అన్ని బజాజ్‌ ఆటో డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తక్కువ ధరకే కొత్త బైక్​ను మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు హోండా మోటార్‌ సైకిల్ అండ్​ స్కూటర్ ఇండియా వెల్లడించింది.

Bajaj Dominar 400
బజాజ్​ డొమినార్​ 400
author img

By

Published : Oct 25, 2021, 7:30 PM IST

డొమినార్‌ స్పోర్ట్స్‌ టూరర్‌ విభాగంలో డొమినార్‌ 400 బైక్‌ను(Bajaj Dominar 400) బజాజ్‌ ఆటో సోమవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2,16,648(Bajaj dominar 400 price) (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). 373.8 సీసీ డీఓహెచ్​సీ ఎఫ్​ఐ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్, 40 పీఎస్‌ పవర్‌ దీని సొంతమని బజాజ్‌ ఆటో తెలిపింది. ఈ బైకులు ప్రస్తుతం అన్ని బజాజ్ ఆటో షోరూమ్‌లలో అరోరా గ్రీన్​, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

'డొమినార్‌ బ్రాండ్‌ తనకంటూ ఓ బలమైన ఫాలోయింగ్‌ను సృష్టించుకోగలిగింది. సుదూర పర్యటకులు దీన్ని బాగా ఇష్టపడి ఎంపిక చేసుకునే విధంగా ఉంది' అని బజాజ్‌ ఆటో మార్కెంటిగ్​ హెడ్​ నారాయణ సుందరరామన్​ అభిప్రాయపడ్డారు.

ఫీచర్లు..

  • 373.8 సీసీ డీఓహెచ్​సీ ఎఫ్​ఐ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్
  • ​40 పీఎస్​ పవర్​ విడుదల చేసే సామర్థ్యం
  • 6 గేర్​ ట్రాన్స్ మిషన్​
  • రెండు చక్రాలకు డిస్క్​ బ్రేక్
  • డిజిటల్ స్పీడో మీటర్​ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

వచ్చే ఏడాది హోండా నుంచి మరో బైక్​

హోండా మోటార్‌ సైకిల్ అండ్​ స్కూటర్ ఇండియా (హెచ్​ఎంఎస్​ఐ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త ఎంట్రీ లెవల్ బైక్​ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని కంపెనీ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. కొత్త మోడల్ బైక్​.. దేశీయ మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Tesla India: 'భారత్‌లో తయారీ ప్రారంభిస్తే.. ప్రయోజనాలు కల్పిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.