శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోదావరిపురంలో తెదేపా పోలింగ్ ఏజెంట్ మార్కండేయులుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. వేరొకరి ఓటు వేసేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలను మార్కండేయులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన వైకాపా నేతలు తనపై దాడి చేసి గాయపరిచారని మార్కండేయులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన మార్కండేయులును పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి వెళ్లా: కోడెల