ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించిన విధంగానే వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పేరును వైఎస్సార్ పింఛను కానుకగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ రూ. 2250లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన పింఛను పథకం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త పింఛను పథకం ప్రకారం వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు అందించనున్నారు. వృద్ధాప్య పింఛను అర్హుల వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. నవరత్నాల్లో ఒకటైన పింఛను పెంపుపై తొలి అడుగు పడింది.
ఇవీ చూడండి : ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'