ETV Bharat / briefs

వేసవి ఎద్దడికి కళవిహీనంగా కలంకారీ - vja_kalankari

వేసవి ప్రభావం... సామాన్య ప్రజలపైనే కాదు. పరిశ్రమల మనుగడనూ ఇబ్బంది పెడుతోంది. నీటిపై ఆధారపడిన కలంకారీలాంటి పరిశ్రమల నిర్వాహకులను... సమస్యల వలయంలోకి నెట్టేస్తోంది. కష్టపడి సిద్ధం చేసిన వస్త్రాలను నీటితో తడపాల్సిన పరిస్థితుల్లో... ముంచుకొచ్చిన ఎద్దడి... వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

kalankari
author img

By

Published : Apr 21, 2019, 7:05 AM IST

వేసవి ఎద్దడికి కళవిహీనంగా కలంకారీ

కృష్ణా జిల్లాలోని పెడన... కలంకారీ పరిశ్రమకు పుట్టినిళ్లు. 80 శాతం కుటుంబాలకిదే జీవనాధారం. చేతితో అచ్చులు వేస్తూ అందమైన వస్త్రాల తయారీ ఇక్కడి కార్మికుల ప్రత్యేకత. దేశ విదేశాల్లోనూ కలంకారీ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

కలంకారీ కార్మికులకు ఈ వేసవి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అవసరమైన నీరు లభించకపోవడం సమస్యగా మారింది. పదేళ్ల క్రితం వరకు పెడన సమీపంలోని బందరు కాలువలో నీటి ప్రవాహం ఉండేది. రానురాను పరిస్థితి మారింది. ఎగువన ప్రకాశం బ్యారేజీలో నీటికొరత కారణంగా ఒకే పంటకు నీరు ఇస్తున్నారు. నవంబర్ ముగిశాక కాలువలో నీటిప్రవాహం ఆగిపోతుంది. అప్పట్నుంచి కళంకారీలకు కష్టాలు మొదలవుతాయి. 6 నెలలపాటు నీటి కోసం రోజూ వెతుక్కోవాల్సి వస్తోంది. వందల కిలోమీటర్లు పయనించాల్సి ఉంటుంది.

పెడన నుంచి ఆటోలు, లారీల్లో వస్త్రాలను 70 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం గ్రామ సమీపంలోని కృష్ణా నదికి వస్తారు. అక్కడా ప్రవాహం ఆగిపోతే విజయవాడ సమీపంలోని పెద్ద పులిపాక వెళ్తారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయిన కారణంగా... ఇప్పుడు ఆ పరిస్థితీ చేయిదాటి పోయింది.

తాగునీటి కోసం బందరు కాలువకు ఏటా వదిలే నీరు ఈసారి ఇంకా రాలేదు. విధిలేని పరిస్థితుల్లో గోదావరి ప్రవాహాన్ని నమ్ముకుంటున్నారీ పెడన కలంకారీలు. 200 కిలోమీటర్లలోని ప్రయాణించి తూర్పుగోదావరి జిల్లా సిద్ధాంతం వెళ్తున్నారు. రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. భారాన్ని భరించలేక పరిశ్రమ మూసివేతకు సిద్ధమవుతున్నారీ కార్మికులు.

కలంకారీ వస్త్రాలు తడిపేందుకు శుద్ధమైన నీరే కావాలి. ఉప్పు నీరు వాడితే నాణ్యత దెబ్బతింటుంది. సిద్దాంతం ప్రాంతంలో ఉదయం 11లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి లేకుంటే ఉప్పునీరు వచ్చేస్తుంది. రాత్రంతా ప్రయాణించి ఉదయానికి నదీతీరానికి చేరుకుంటున్నారు. మండుటెండలో ఇసుక తెన్నెలు వేడెక్కి కాళ్లు బొబ్బలెక్కిత్తున్నాయి. ఒక్కోసారి ఆటోలు నదీతీరంలో ఇరుక్కుపోతే ఆ బాధలు వర్ణనాతీతం.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలంకారీ కార్మికులకూ ఇదే సమస్య రాగా... అక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చెరువు తవ్వించారు. ముందుగా నీటితో నింపి వేసవిలో నాటికి అందుబాటులో ఉంచి కలంకారీ కార్మికుల కష్టాలు తీర్చారు. తమ ప్రాంతంలోనూ ఇలాగే శాశ్వత చర్యలు తీసుకోవాలని పెడన కలంకారీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మామూలు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రాక కలంకారీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వేసవి వచ్చిందంటే అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని... కొనుగోలు దారులూ ధర పెంచడం లేదని చెబుతున్నారు. ఎంత కష్టపడినా పూటగడవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Intro:AP_ONG_94_19_GANGAMMA_TIRUNALLA_AVB_C10
A. SUNIL
SANTANUTALAPADU
7093981622

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం గార్లపాడు లో గంగమ్మ తిరునాళ్ల జాతర కన్నుల పండుగగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొనీ బలులు అర్పించారు ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయం చుట్టూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.