విశాఖ సాగర తీరంలో నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చిన యునైటెడ్ స్టేట్స్ అమెరికా నౌకాదళానికి చెందిన జేపీ ముర్తా యుద్ధనౌకను విద్యార్థులు సందర్శించారు. యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ద్వారా ఎంపికచేసిన కళాశాలల విద్యార్థినులు నౌకను వీక్షించే అవకాశాన్ని పొందారు. విశాఖ పోర్టులోని ఓర్ బెర్తుపై ఈ నౌకను నిలిపారు. సెయింట్ ఆంటోనియా శాన్ శ్రేణికి చెందింది. యుద్ధనౌక సిబ్బంది, అధికారులు గత రెండు రోజులుగా విశాఖ నగరాన్ని సందర్శిస్తున్నారు. సామాజికంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. యుద్ధ నౌకను సందర్శించడం పట్ల విద్యార్థినులు ఆనందంవ్యక్తం చేశారు.
విశాఖ సాగరతీరంలో సమయాన్ని గడపడం సంతోషంగా ఉందని యూఎస్ యుద్ధ నౌక కెప్టెన్ కెవిన్ లేన్ చెప్పారు. అమెరికా యుద్ధనౌక సిబ్బంది నాలుగు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది. ఈ తరహా కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయన్న అభిప్రాయాన్ని నౌక సిబ్బంది వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలతో మమేకం కావడం, వివిధ సామాజిక అంశాల్ని పరిశీలించడం తమ సిబ్బందిలో సరికొత్త ఉత్సాహం కలిగించిందన్నారు.
ఇవీ చూడండి : దివ్యాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు!