ETV Bharat / briefs

ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయానికి గల కారణాలపై మేధోమథనం జరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేసినా.. ప్రతిపక్షం ఎత్తి చూపటానికి ఒక్క అవినీతి అంశమూ లేని విధంగా పాలన అందించినా... ఇంత ఘోర పరాభవానికి గల కారణాలు ఏమిటనే విశ్లేషణ సాగుతోంది.

ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ
author img

By

Published : May 25, 2019, 7:30 PM IST

ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం సాగుతోంది. అధినేత చంద్రబాబు తన నివాసంలో నేతలను కలుస్తూ కారణాలు విశ్లేషిస్తున్నారు. గెలుపొందిన అభ్యర్థులను అభినందిస్తూనే... ఓడిన వారికి ధైర్యం చెప్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి లేని స్థానాలు, నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుస విజయాలు నమోదు చేసిన సీట్లు ఈసారి గల్లంతవటం వెనుక వాస్తవాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు.

జన్మభూమి కమిటీలు కొంప ముంచాయనే వాదన వినిపిస్తున్నా... చేసిన అభివృద్ధి-సంక్షేమాన్ని మించిన స్థాయిలో ఈ కమిటీలు దెబ్బతీశాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే కారణమైతే 150స్థానాల్లో ఆ ప్రభావం ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన 8 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి లేని స్థానాలు ఈసారి కోల్పోవటానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు.

ఇవేనా కారణాలు..
1. జన్మభూమి కమిటీలు
2. పవన్ కల్యాణ్
3. కొందరు నేతల అక్రమాలు
4. గెలుపుపై అతివిశ్వాసం

మొదటి నుంచి గెలుస్తూ... ఇప్పుడు ఓడిపోయిన స్థానాలు..
అనంతపురం జిల్లా పెనుగొండ, కృష్ణా జిల్లా నందిగామ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ 8 వరుస విజయాలు నమోదు చేసింది. ఈసారి ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న పార్థసారథి, తంగిరాల సౌమ్య, మాధవనాయుడు ఓడిపోయారు.

విశాఖ జిల్లా శృంగవరపుకోట, నర్సీపట్నం, పాయకరావుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా అభ్యర్థులు ఓడిపోయారు. పాయకరావుపేటల్లో 7సార్లు గెలిచిన పసుపుదళం ఈసారి ఓటమి పాలైంది. వీరిలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓడిపోగా.. పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత స్థానం మార్చి కొత్త అభ్యర్ధికి సీటు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.

శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. ఆరుసార్లు గెలిచిన పార్వతీపురంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరంజీవులు నెగ్గలేదు. గతంలో ఏడుసార్లు గెలిచిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. వరుసగా ఐదుసార్లు గెలిచిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్వల్ప తేడాతో ఓడిపోగా.. విజయనగరం నుంచి అనేకసార్లు గెలిచిన సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు ఈసారి తన కుమార్తె అదితిని పోటీ చేయించారు. అయితే ఆమె గెలవలేకపోయారు. గత ఐదుసార్లుగా గెలుస్తూ వస్తున్న చిత్తూరు ఎంపీ సీటును ఈసారి తెదేపా కోల్పోవాల్సి వచ్చింది.

కొంపముంచిన పవన్
ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్​కు పడకుండా పవన్ కళ్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం.. జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైకాపాకే మేలు చేసిందనే అభిప్రాయం నేతల నుంచి వ్యక్తమవుతున్నా.. అది 30వరకూ స్థానాలకే పరిమితమైందనే భావనా వినిపిస్తోంది. మిగిలిన స్థానాల్లో మరీ దారుణ పరిస్థితికి కారణాలేమిటనే విషయం ఇంకా అంతుచిక్కటం లేదు. మరో 30 వరకూ స్థానాలు కోల్పోవడానికి ఇసుక, గనుల వంటి అంశాల్లో నేతలు సాగించిన అక్రమాలని తెలిసీ చంద్రబాబు అడ్డుకట్ట వేయలేకపోవటమూ.. దెబ్బతీసిందనే విషయాన్ని అధిష్ఠానం గుర్తించింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారికి స్థానిక పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ టికెట్లు ఇవ్వడం.. 175 శాసనసభ స్థానాల్లో, 25 లోక్‌సభ స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని ప్రజలను కోరినా.. ఆ అంచనా తప్పిందని భావిస్తున్నారు.

పని చేయని 'అభివృద్ధి'
అభివృద్ధి-సంక్షేమం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉన్నా... వైకాపా కోరిన 'ఒక్క అవకాశం' అనే నినాదం ప్రజల్లోకి వెళ్తోందనేది అంచనా వేయటంలో విఫలమయ్యామనే అభిప్రాయమూ నేతల్లో వ్యక్తమవుతోంది. పోల్ మేనేజ్​మెంట్​లో పార్టీ అభ్యర్థులకు ఎన్నికల విరాళాలు రాకుండా భాజపా సహకారంతో వైకాపా అడ్డుకున్న తీరూ ఓ 25స్థానాల్లో ప్రభావితం చూపిందనే భావన వినిపిస్తోంది. మరికొన్ని చోట్ల జన్మభూమి కమిటీల పేరుతో కొందరు చేసిన పెత్తనం పార్టీని ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా కర్ణుడు చావుకి అనేక కారణాలన్న రీతిలో అన్ని అంశాలు ప్రభావం చూపి అంచనాలను తారుమారు చేశాయనే అంతర్మథనం పార్టీలో సాగుతోంది.

ఇప్పడు తదుపరి కార్యాచరణ ఏమిటనేదానిపై తెలుగుదేశం దృష్టి సారిస్తోంది. శాసనసభాపక్షనేతగా అధినేత చంద్రబాబు కొనసాగితే... మండలి ప్రతిపక్షనేతగా యనమల రామకృష్ణుడుని నియమించాలని భావిస్తున్నారు. శాసనసభాపక్షనేత ఎన్నిక ఎప్పుడు చేపట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇవీ చదవండి..

ఈవీఎంల ట్యాంపరింగ్​తోనే వైకాపా విజయం'

Intro:Ap_Vsp_61_25_Vamsikrishna_Fire_On_Velagapudi_Comments_Ab_C8

Body:విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలుపొందిన వెలగపూడి రామకృష్ణ బాబు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర పదజాలంతో మాట్లాడడం సమంజసం కాదని వైకాపా విశాఖనగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా నాయకుడిగా ఉంటూ చదువుకున్న వ్యక్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని వంశీకృష్ణ మండిపడ్డారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బహిరంగంగా ఒక పార్టీ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని వెలగపూడి రామకృష్ణ బాబు చేసిన వ్యాఖ్యలకు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రశాంతమైన విశాఖ నగరానికి ఇలాంటి నాయకుల వల్ల అపఖ్యాతి వచ్చే ప్రమాదం ఉందని ఆయన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు
---------
బైట్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైకాపా విశాఖనగర అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.