బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ప్రియాంక, అనుపమ్ ఖేర్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ ,రితేశ్ దేశ్ముఖ్ వంటి ప్రముఖులు ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
Numb beyond belief at the dastardly terror attack on #CRPF soldiers in #Pulwama. May God give peace to their souls, and strength to their grieving families. Wishing the injured a speedy recovery. We can’t let this be forgotten.
— Akshay Kumar (@akshaykumar) February 14, 2019
ఊహించని రీతిలో మన సీఆర్పీఎఫ్ సైనికులను ఉగ్రవాదులు దెబ్బకొట్టారు. వీరమరణం పొందిన సైనికులకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మేము ఈ దాడిని మరిచిపోము తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటాం
-అక్షయ్ కుమార్, నటుడు
Absolutely shocked by the attack in #Pulwama...Hate is NEVER the answer!!! Strength to the families of the martyred jawans and the CRPF soldiers injured in the attack.
— PRIYANKA (@priyankachopra) February 14, 2019
- ప్రియాంక చోప్రా, నటి
Such terrible news coming from #Pulwama. Today when people are celebrating love, hate raises it’s ugly head too. My thoughts and prayers for the martyrs and their families.
— Abhishek Bachchan (@juniorbachchan) February 14, 2019
ఈ రోజు ప్రజలందరూ ఆనందంగా ప్రేమను పంచుకుంటుంటే...ద్వేషాన్ని కూడా పంచాల్సి వస్తుందని ఊహించలేదు. ఆ వీర సైనికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.
- అభిషేక్ బచ్చన్, నటుడు
పుల్వామా ఘటనను 1989 తరవాత భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడిగా పేర్కొంది రక్షణ శాఖ. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తోన్న సీఆర్పీఎఫ్ వాహనంపైకి ఉగ్రవాద ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీని వల్ల బస్సులో ఉన్న సుమారు 43మంది జవాన్లు వీరమరణం చెందారు