ఇవీ చూడండి :'గౌరవం'పై మాటల మంటలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. రాహుల్ జోక్యం! - ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరకూ వెళ్లింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో.. రాహుల్ స్పందించారు. సబితకు ఫోన్ చేశారు. దిల్లీకి రావాలని ఆహ్వానించారు. కుమారుడు కార్తీక్‌తో కలిసి సబిత దిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరకూ వెళ్లింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో.. రాహుల్ స్పందించారు. సబితకు ఫోన్ చేశారు. దిల్లీకి రావాలని ఆహ్వానించారు. కుమారుడు కార్తీక్‌తో కలిసి సబిత దిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. వీరితోపాటు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి.. రాహుల్‌ను కలవనున్నారు. ఇటీవల సబిత తెరాసలో చేరుతారన్న ఊహాగానాల నడుమ వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రేపు భేటీ కానుంది. హస్తం నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క సైతం దిల్లీకి వెళ్లనున్నారు.
ఇవీ చూడండి :'గౌరవం'పై మాటల మంటలు