ఇవీ చదవండి...ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు"
ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: ఆర్టీసీ ఐకాస
ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఐకాస నేతల చర్చలు ముగిశాయి. డిమాండ్ల పరిష్కార దిశగా సమాలోచనలు చేశామని... ఆర్టీసీ ఐకాస కన్వీనర్ పలిశెట్టి దామోదర్ తెలిపారు. సమ్మె విషయమై కార్మిక సంఘాల నేతలతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ముగిసిన ఆర్టీసీ ఐకాస చర్చ
ఈనెల 13న సమ్మెకు దిగుతామని నోటీసులిచ్చిన ఆర్టీసీ ఐకాస నేతలతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. రవాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి. కృష్ణబాబు నేతృత్వంలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈయూ సహా 10 సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ల పరిష్కార మార్గాలను అధికారులకు వివరించారు. పలు సమస్యలపై సానుకూల సమాలోచనలు చేశామన్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ పలిశెట్టి దామోదర్... సమ్మెపై కార్మిక సంఘాల నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. కార్మికుల పదవీవిరమణ వయసు 60ఏళ్లకు పెంచే నిర్ణయంపై సానుకూలంగా స్పందించారన్నారు. ఈ నెల 10న సీఎం జగన్‌తో సమావేశమై...తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని దామోదర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి...ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు"