ETV Bharat / briefs

తెలంగాణ నుంచి.. సొంతూళ్లకు పోటెత్తిన రాష్ట్ర ఓటర్లు - పంతంగి టోల్​గేట్​ వద్ద భారీ ట్రాఫిక్​ జామ్​

ఓట్ల పండుగ వచ్చేసింది. రేపే పోలింగ్ జరగనుంది. రాష్ట్రవాసులంతా... సొంతూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా కుటుంబాలు ఇంటిల్లిపాదితో సహా తరలివస్తున్నారు. వీరి రాకతో దారులు కిక్కిరిసిపోయాయి. వేల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కి చాలాచోట్ల రద్దీ ఏర్పడింది. ఇక టోల్ ప్లాజాల వద్ద.. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మండుటెండల్లో వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

trafic
author img

By

Published : Apr 10, 2019, 12:02 PM IST

పంతంగి టోల్​గేట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రవాసులంతా... ఓటు హక్కు వినియోగించుకోవాలని సొంతూళ్లకు బయల్దేరారు. తెల్లవారుఝామునే టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

చేతులెత్తేసిన టోల్​ప్లాజా సిబ్బంది

ఓటు వేయాలన్న ఉత్సాహంతో బయలుదేరిన వాహనదారులకు టోల్ ప్లాజా సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. భారీగా వస్తున్న వాహనాలను తొందరగా పంపడంలో విఫలమవుతున్నారు. పండుగలప్పుడు తప్ప సాధారణ సమయాల్లో ఈ టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ అంతగా ఉండదు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి.

ఘర్షణకు దారి తీస్తున్న రద్దీ

రద్దీ పెరగడం వల్ల టోల్​ప్లాజా నిర్వహకులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. టోల్​ వసూలు చేయొద్దంటూ గొడ పెట్టుకున్నారు. గేట్లు ధ్వంసం చేసి టోల్​ రుసుం చెల్లించకుండానే కొందరు వాహనదారులు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.