శాసన మండలి సభ్యత్వానికి తెదేపా నేత పయ్యావుల కేశవ్ రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యునిగా ఎన్నిక అయినందున ఆయన మండలికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను ఆమోదిస్తూ శాసన మండలి కార్యదర్శి సత్యనారాయణరావు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు.. హోంశాఖ సలహాదారు పదవికి మాజీ ఐపీఎస్ అధికారి కోడె దుర్గాప్రసాద్ రాజీనామా చేశారు. హోంశాఖ సలహాదారుగా ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాలతో పాటు, వివిధ అంశాలను పర్యవేక్షించేవారు. దుర్గాప్రసాద్ రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
ఇవీ చూడండి : ఓటమిని విశ్లేషించుకుందాం.. ముందుకు పోదాం!