హామీలు
అత్తవారింటికి వెళ్లే నవవధువులకు ఓ పెద్దన్నలా అండగా ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.మహిళలే జనసేన బలమన్న పవన్.. ప్రచారసభలో పలు హామీలు ఇచ్చారు. వధువులకు పెళ్లి కానుకగా 'మా ఇంటి మహాలక్ష్మి' పథకం అమలు చేస్తామన్నారు. నవవధువులు అత్తవారింటికి ఉత్త చేతులతో వెళ్లకుండా చీర-సారె పథకం కింద రూ.10,116 అందిస్తామని తెలిపారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలందిస్తామని పవన్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 10 సిలెండర్లు అందిస్తామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా రైతులకు అండగా నిలబడతామన్న పవన్... రూ.5 వేల కోట్లతో శీతల గిడ్డంగులు, హైబ్రిడ్ వంగడాల అభివృద్ధి, అధునిక సాగు పద్ధతులు అమలుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూనే...నీటి కాలుష్యాన్ని ఆపేందుకు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే జీరో డిశ్చార్జ్ సాంకేతికతను అమలుచేస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పాతపింఛను విధానం, యువతకు మాజీ సైనికాధికారుల ఆధ్వర్యంలో చైతన్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లు నిండిన రైతులు, 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5 వేల పింఛను ఇస్తామని జనసేనాని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి 88 అసెంబ్లీ, 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం: లక్ష్మీనారాయణ