ETV Bharat / briefs

పార్లమెంటులో వాజ్​పేయీకి ఘన నివాళి

పార్లమెంటు సెంట్రల్​ హాల్​లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్​పేయీ చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.

వాజ్​పేయీకి ఘన నివాళి
author img

By

Published : Feb 12, 2019, 3:27 PM IST

దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారి వాజ్​పేయీకి పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. ప్రధానిగా వాజ్​పేయీ సేవలకు గుర్తింపుగా ఆయన చిత్రపటాన్ని సెంట్రల్​ హాల్​లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వాజ్​పేయీకి ఘన నివాళి
undefined

వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు క్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని రాష్ట్రపతి కీర్తించారు. రహదారులు, ఐటీ, టెలికం రంగాల సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు కోవింద్. చిత్రపటాన్ని రూపొందించిన కళాకారుడు కృష్ట కన్నయ్యను రాష్ట్రపతి అభినందించారు.

"ఇప్పటి నుంచి అటల్‌ జీ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు స్ఫూర్తినిస్తారు. ఆయన సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధాంతాలను వదల్లేదు. అటల్‌జీ గొప్ప వక్త. ఆయన ప్రసంగంలో తెలియని ఓ శక్తి ఉంటుంది. ఆయన మౌనం మరింత శక్తిమంతమైంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మహాత్ముల సరసన...

దేశంలో అత్యంత ప్రభావిత వ్యక్తుల చిత్రపటాలను పార్లమెంటు సెంట్రల్​ హాల్​లో ప్రతిష్ఠిస్తారు. ఇప్పటివరకు మహాత్మాగాంధీ, జవహార్​లాల్​ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, రవీంద్రనాథ్​ ఠాగూర్​, బీఆర్ అంబేడ్కర్​, దాదాబాయీ నౌరోజీ, ఇందిరా గాంధీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖుల చిత్రపటాలు సెంట్రల్​ హాల్​లో కొలువై ఉన్నాయి.

ప్రధాన మంత్రులుగా పని చేసిన వారిలో నెహ్రూ, లాల్​ బహదూర్​ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్​గాంధీ తరవాత వాజ్​పేయీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.

దీర్ఘకాలిక అనారోగ్యంతో 2018 ఆగస్టులో అటల్​జీ మరణించారు. మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిన మొదటి ప్రధాని వాజ్​పేయీ.

Jaipur (Rajasthan), Feb 12 (ANI): Robert Vadra and his mother Maureen Vadra arrived at the Enforcement Directorate (ED) office in Rajasthan's Jaipur for questioning in connection with Bikaner land case probe. Congress General Secretary for Uttar Pradesh East Priyanka Gandhi Vadra was also present with them. 'Priyanka Gandhi Zindabad' and 'Chowkidaar Chor Hai'' slogans were raised outside ED office.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.