ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఖరారైన ముహూర్తం కడపజిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించే బ్రహ్మోత్సవాలను తితిదే ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. స్వామివారి కల్యాణం ఏప్రిల్ 18న రాత్రి నిర్వహించాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
కార్యక్రమాల వివరాలు :
- ఏప్రిల్ 12న అంకురార్పణ
- ఏప్రిల్ 13న ధ్వజారోహణం
- 14న హంసవాహనం
- 15న సింహవాహనం
- 16న హనుమత్సేవ
- 17న గరుడసేవ
- 18న స్వామివారి కల్యాణం
- 19న రథోత్సవం
- 20న అశ్వవాహన
- 22న పుష్పయాగంతో ఉత్సవాలు ముగింపు