దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2019 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14,10,754 మంది పరీక్షకు హాజరు కాగా...7,97,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 39,039 మంది ఉత్తీర్ణత సాధించగా... తెలంగాణ నుంచి 33,044 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాజస్థాన్‌కు చెందిన నలిన్ ఖండేల్‌వాల్ అనే విద్యార్థి మొదటి ర్యాంకు, దిల్లీకి చెందిన భవిక్ బన్సాల్ అనే విద్యార్థి రెండో ర్యాంకు సాధించాడు. టాప్ 50లో తెలుగు రాష్ట్రాలకు నాలుగు ర్యాంకులు లభించాయి. తెలంగాణకు చెందిన జి.మాధురిరెడ్డి ఏడో ర్యాంకు సాధించగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని ఖురేషీ హస్రా 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజకు 40వ ర్యాంకు, ఎస్.శ్రీనందన్‌రెడ్డికి 42వ ర్యాంకు సాధించారు.