శ్రీలంకలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన విశాఖ నేత్ర విద్యాలయ విద్యార్థులను చిన్నజీయర్ స్వామి శనివారం సత్కరించారు. వివిధ దేశ విదేశీ క్రీడల్లో విజయం సాధించిన వారికి మంగళశాసనాలు అందించారు. దేశం గర్వించే రీతిలో అంధ విద్యార్థులు దూసుకుపోతున్నారని కొనియాడారు. వారికి సమాజం చేయుతనివ్వాలని కోరారు. వుడా బాలల థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో..మహా సిమెంట్, మై హోమ్ అధినేత రామేశ్వర్, కలెక్టర్ కె. భాస్కర్లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంగీత కచేరీలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి..చిన్న జీయర్‌స్వామి ఆధ్వర్యంలో... వెంకన్న కల్యాణం