నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో, 940 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 8వేల 910 పోలింగ్ స్టేషన్లను వార్డులు వారిగా గుర్తించడం జరిగింది. మొత్తం 16లక్షల 45వేల 439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 8లక్షల 35వేల 412 మంది, పురుష ఓటర్లు 8లక్షల 9వేల 842 మంది ఉన్నారు. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు రిజర్వేషన్లుపై అభ్యంతరాలు, చేరికలకు అవకాశం ఇచ్చారు. జూన్ 4 నుంచి 10 వరకు పంచాయితీల వారిగా గుర్తింపు చేయనున్నారు. జూన్ 11 నుంచి 17 వరకు గ్రామసభలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండీ :