మోదీది అనధికార పర్యటన కావడం వల్ల ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ బేబే రాణి మౌర్య గానీ, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గానీ విమానాశ్రయానికి రాలేదు.
రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులతో పాటు, రుద్రపూర్‌లోని ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఐసీజీపీ)ని మోదీ ప్రారంభించాల్సి ఉంది. దేశంలోనే తొలిసారిగా రూ.3,400 కోట్లతో నిర్మిస్తున్న ఐసీజీపీ వల్ల వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
అలాగే ప్రధాని మోదీ 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైతు సంక్షేమ పథకం' లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం కార్బెట్ పులుల సంరక్షణా కేంద్రాన్ని సందర్శించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షంపడే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది.