విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత : మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోగ్యకర జీవనం, క్రమశిక్షణకు క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే 2కె రన్లో మంత్రితో పాటు కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, అధికారులతో కలిసి మంత్రి...శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి నుంచి ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానం వరకు 2కె రన్ చేశారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజంతో పాటు ఆరోగ్యం లభిస్తుందన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా తల్లితండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. చిన్ననాటి నుంచి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు.
ఇదీ చదవండి : యోగా పోటీల్లో సీఐడీ ఇన్స్పెక్టర్ పతకాల వేట