ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మంగళగిరి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు..ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్. కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన లోకేశ్‌కు ఆయన భార్య బ్రాహ్మిణి దిష్టి తీశారు. తల్లి భువనేశ్వరి ఎదురొచ్చారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ర్యాలీగా వచ్చారు.
ఇవి కూడా చదవండి....