ETV Bharat / briefs

'విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తాం'

రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ చేసిందంటూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను కుటుంబరావు ఖండించారు. ఇదంతా తెదేపా ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియే అని స్పష్టం చేశారు.

author img

By

Published : Apr 22, 2019, 10:07 PM IST

కుటుంబరావు
కుటుంబరావు
వైకాపా నేతలు బొత్స, రామచంద్రయ్య, ఆనం రామనారాయణ రెడ్డి ముగ్గురూ రాజకీయ నిరుద్యోగులని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు... ఆంధ్రప్రదేశ్​లో సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తే తప్పేంటని నిలదీశారు. ఆర్బీఐ నుంచి 9 నెలలో తీసుకోవాల్సిన అప్పు ఒక నెలలో తీసుకున్నట్లు ఆనం చేసిన విమర్శలను కుటుంబరావు తప్పుబట్టారు. దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 40 వేల కోట్లు అప్పు ఉందని విజయ్ సాయి రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధం అవుతున్నామని కుటుంబరావు వెల్లడించారు.

Intro:7777

Body:2222

Conclusion:కడప జిల్లా బద్వేలులో ఈరోజు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు కురిశాయి. గోపవరం ,కాశినాయన మండలాల్లో లో మెరుపులు, పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ విపత్తుల శాఖ ఆయా మండల రెవెన్యూ కార్యాలయాలకు సమాచారాన్ని పంపింది. దీంతో అధికారులు గ్రామాలలో గాలివాన వచ్చినప్పుడు బయటకు వెళ్ళవద్దని, సురక్షిత ప్రాంతంలో ఉండాలని అని ప్రజలను అప్రమత్తం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.