ETV Bharat / briefs

తెలంగాణలో... కుక్కకి మాసికం చేసిన యజమాని - sanjeev

తన భార్య మరణం కూడా అతడిని అంతగా బాధించలేదు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మరణం మాత్రం తీవ్రంగా కలిచి వేసింది. గతనెల 17న మరణించిన టిక్కుకి నెల మాసికం నిర్వహించాడు.

kukka
author img

By

Published : May 18, 2019, 1:05 PM IST

కుక్కకి మాసికం చేసిన యజమాని

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో రిటైర్డ్ డీపీవో గద్దల సంజీవ్​... 14ఏళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకుని పెంచుకున్నాడు. టిక్కూ అని పేరు పెట్టుకున్నాడు. గత ఏప్రియల్ 17న టిక్కు అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సంజీవ్.. టిక్కు జ్ఞాపకాలతోనే గడుపుతున్నాడు. నెల మాసికాన్నీ జరిపించాడు. బంధు మిత్రులందరిని ఆహ్వానించాడు.

సంజీవ్​కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. కుమార్తెలు అమెరికాలో, కొడుకు హైదరాబాద్​లో స్థిరపడ్డారు. మూడేళ్ల క్రితం భార్య మరణించింది. తోడుగా టిక్కు మాత్రమే ఉండేది. తన భార్య చనిపోయినప్పుడూ ఇంతలా బాధపడలేదని.. పెంపుడు శునకం మరణంపై సంజీవ్ ఆవేదన చెందాడు. ఒంటరిగా ఉన్న తనకు టిక్కు తోడుగా ఉందని..ఇప్పుడు అదీ చనిపోవటం వల్ల మళ్లీ ఒంటరయ్యానని వాపోయాడు.

Intro:tg_nzb_01_17_kukka_nela_masikam_avb_c9 నియోజకవర్గంలోని mukal మండల కేంద్రంలో రిటైర్ డి పి ఓ గద్దల సంజీవ్ తన కుక్క పిల్ల tikku గత నెలలో మరణించింది

Body:గత 14 సంవత్సరాలుగా పెంచుకుంటున్న తన కుక్క పిల్ల చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సంజీవ్ గత నెల రోజులుగా తన కుక్క పిల్ల జ్ఞాపకాల తోనే నా జీవితం కొనసాగిస్తున్నారు ఈరోజు కుక్కపిల్ల జ్ఞాపకార్థం నెల మాసికం నిర్వహించి తన బంధు మిత్రులు అందరినీ ఆహ్వానించారు

Conclusion:గద్దల సంజీవి మాట్లాడుతూ తన భార్య చనిపోయినప్పుడు అయినను ఇంతగా బాధపడలేదు అని ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నానని తన సంతాపాన్ని తెలియజేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.