వైకాపా అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై విడుదలయ్యాడు. 7నెలల రిమాండ్ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి శ్రీనివాస్ బెయిల్‌పై బయటకొచ్చాడు. ఆయనకు 23వ తేదీ గురువారం బెయిల్ వచ్చింది. అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఈ ఉదయం ఆయన్ని జైలు అధికారులు విడుదల చేశారు. జగన్‌పై తాను కావాలని దాడి చేయలేదనీ.. అనుకోకుండా జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా జగన్ ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నాడు. తెదేపాకు, నాకు సంబంధం లేదని స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి..