తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ-ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం వైపు వస్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న సిమెంటు లోడు లారీ ఢీకొంది. ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులందరూ కోదాడలోని ఓ అపార్టుమెంటుకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ్మరలో శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పరామర్శించిన ఎమ్మెల్యే...
రోడ్డు ప్రమాద బాధితులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘటనాస్థలికి వచ్చి పరామర్శించారు. మృతులు నాగసులోచన, లక్ష్మయ్య దంపతులతోపాటు సుగుణ, అబ్బాస్‌గా గుర్తించారు. ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 9 మంది ప్రయాణిస్తున్నారు.
ఇదీ చదవండి : ఎన్నికల విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా...