ఇవీ చూడండి ముగ్గుల పోటీలతో ఓటు హక్కు అవగాహన
సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేద్దాం రండి : కేఏ పాల్ - కె ఏ పాల్
వైకాపాకి చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీతో కలిసి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలన్నారు... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గెలుపు అవకాశాలు దెబ్బతీసేందుకు ప్రజాశాంతితో కలిసి తెదేపా 38 మంది అభ్యర్థుల్ని నిలబెట్టిందని... వైకాపా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్
వైకాపాను దెబ్బతీసేందుకు ప్రజాశాంతి పార్టీతో కలిసి తెదేపా ప్రయత్నిస్తుందని మీరు నమ్మితే సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని కేఏ పాల్ జగన్‌కు సవాలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వచ్చిన ఆయన వైకాపా తీరుపై మండిపడ్డారు. నేను తెలుగుదేశం పార్టీకి పార్టనర్ కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తే... ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తానని హామీ ఇచ్చిన కేఏ పాల్ ...ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు.
ఇవీ చూడండి ముగ్గుల పోటీలతో ఓటు హక్కు అవగాహన
sample description