ఇవీ చూడండి కాంగ్రెస్ 'పంచతంత్ర' మేనిఫెస్టో విడుదల
పోలవరంపై.. మోదీ ఆరోపణలు సరికాదు: కనకమేడల - తెదేపా
చంద్రబాబును అడ్డుకోవడమే భాజపా, తెరాస, వైకాపాల అజెండా అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. చంద్రబాబు ఏకపక్షంగా గెలుస్తున్నారని తెలిసి కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
భాజపా, వైకాపాల కుట్రలో భాగంగానే రాజమహేంద్రవరంలో మోదీ సభ పెట్టారని ఢిల్లీలో తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజమెత్తారు. పోలవరం ఏటీఎంలా మారిందని ఆరోపణలు చేయటం ప్రధాని స్థాయి వ్యక్తికి సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత... కేంద్రం ఇచ్చింది ఎంత అని ప్రశ్నించిన కనకమేడల..పోలవరం బాగా కడుతున్నారని పార్లమెంటులో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. దిల్లీని మించిన రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పిన మోదీ...అమరావతికి నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.
ఇవీ చూడండి కాంగ్రెస్ 'పంచతంత్ర' మేనిఫెస్టో విడుదల
sample description