పశ్చిమగోదావరి జిల్లాలో వీడియో వక్రీకరించిన కేసులో రెండో నిందితుడు వైకాపా రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి నానిని పోలీసులు అరెస్టు చేశారు. దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకవర్గాన్ని కించపరిచినట్లుగా ఓ వీడియోను 30సెకన్లుఎడిటింగ్ చేశారు. ఆ వీడియోని సామాజిక మాద్యమాల్లో వైరల్ చేయడంలో నాని పాత్ర ఉందని దర్యాప్తులో వెల్లడైంది. అందుకే పోలీసులు అతన్ని రాత్రి అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే ఈ కేసులో మొదటి నిందితుడు కత్తుల రవికుమార్ అరెస్టయ్యారు.
నానికి 2 రోజుల క్రితమే పెళ్లైంది. భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చిన అతన్ని అరెస్టు చేశారు.ఈ సంఘటనతో వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏలూరు మూడో పట్టణ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.మరికొంతమంది ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో బైఠాయించారు. అర్థరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. పోలీసులు వారితో మంతనాలు జరిపి... నిరసన విరమింపజేశారు.